Advertisement
రామ్ చరణ్, అల్లు అర్జున్….ట్రైన్ లో కూర్చొని స్వీట్ ను తింటూ ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది! ఇంతకీ ఆ ఫోటో ఎప్పటిది? ఆ స్టోరి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.!
ఇది 2009 నాటి ఫోటో…అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రచారం కోసం…హైద్రాబాద్ నుండి ఓ ప్రత్యేక రైలులో… రామ్ చరణ్ , అల్లు అర్జున్ తో పాటు మరికొంత మంది సినిమా స్టార్స్….చిరంజీవికి మద్దతుగా ప్రజా రైలు యాత్ర చేశారు.
రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉభయ గోదావరి జిల్లాలో పార్టీ ప్రచారంలో ఉండగా…. ఫ్యాన్స్ ఇచ్చిన వరల్డ్ ఫేమస్ తాపేశ్వరం కాజా తింటున్నప్పుడు తీసిన ఫోటో ఇది.!
Advertisement
అప్పటికే అల్లు అర్జున్…. గంగోత్రి, ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు , పరుగు సినిమాలతో మంచి ఫాలోయింగ్ ను సంపాధించుకున్నాడు.! రామ్ చరణ్ కూడా చిరుత, మగధీర సినిమాలతో జనాలకు దగ్గరయ్యాడు.
Advertisements
Advertisements
కానీ ఆ ఎన్నికల్లో…. చిరంజీవి పార్టీ ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది. 294 స్థానాల్లో పోటిచేసి 18 సీట్లనే గెల్చుకుంది. రెండు స్థానాల్లో పోటీచేసిన చిరంజీవి తిరుపతిలో గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు. !