Advertisement
జీవితం ఎవరికి వడ్డించిన విస్తరి కాదు.. మన ముందున్న ఖాళీ విస్తరిలోకి పంచభక్ష్య పరమాన్నాలు వచ్చి చేరాలంటే మన కష్టం ఎంతో ఉండాలి. ఇప్పుడు గొప్పగొప్ప స్థానాల్లో ఉన్నవాళ్లందరూ ఒకప్పుడు కష్టపడ్డవారే..ముఖ్యంగా సినిమా వాళ్లు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు..అవకశాల కోసం కష్టం..వచ్చిన అవకాశం నిలబెట్టుకోవడం కష్టం.. నిలబెట్టుకోకపోతే ముఖం మీదే నో చెప్పే వారెందరో..ఈ క్రింద ఫోటోలో షార్ట్ వేసుకుని, భుజాన ఒక బ్యాగ్ తగిలించుకుని కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టగలరా? అతనెవరో? ఆ ఆటో డ్రైవర్ తో ఏం మాట్లాడుతున్నాడో?? అనే విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..ఒక్కో అవకాశాన్ని కాపాడుకుంటూ ఒక్కో మెట్టూ పైకెక్కి ప్రస్తుతం బాలివుడ్ ఖాన్ త్రయంలో ఒకరిగా ఉన్న మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈ ఫోటోలో ఉన్నది.
చైల్డ్ యాక్టర్ గా “యాదోం కి బారత్” లో కనిపించిన అమీర్..తర్వాత చదువుపై దృష్టి పెట్టాలనుకున్నారు..కానీ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లంస్ తో టెన్త్ వరకు ఎలాగొ లాక్కొచ్చి..తర్వాత ఇంటర్మీడియట్ కూడా పూర్తిచేసాడు..రోజుకు ముప్పై మంది వరకు అప్పుల వాళ్లు ఇంటిముందు ఉండేవారట..అమీర్ తండ్రి తాహిర్ హుస్సేన్ ప్రొడ్యుసర్, డైరెక్టర్ ఏ సినిమా చేసినా లాస్ అవ్వడంతో అప్పులు పెరిగిపోయాయి..
Advertisement
పదహారేళ్ల వయసప్పుడే స్నేహితుడితో కలిసి షార్ట్ ఫిలింస్ తీసిన అమీర్..తర్వాత థియేటర్ ఆర్ట్స్ వైపు మల్లి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కోచింగ్ తీసుకుని డైరెక్టర్ మరియు ప్రొడ్యుసర్ అయిన పెదనాన్న నాజీర్ హుస్సేన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు..ఒకట్రెండు సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసాక అమీర్ ని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నాడు నాజిర్ హుస్సేన్..
అలా మొదలైందే “కయామత్ సే కయామత్ తక్”..అమీర్ , జూహిచవ్లా జంటగా వచ్చిన ఆ సినిమా రిజల్ట్ పైనే అమీర్ జీవితం ఆధారపడి ఉంది..దాంతో తనే స్వయంగా ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ని బ్యాగ్ లో పెట్టుకుని ముంబై రోడ్లపై తిరుగుతూ అందరికి పంచిపెట్టేవాడు.. ఒక ఆటో అతన్ని ఆపి తన ఆటో వెనకాల ఆ పోస్టర్స్ అతికించుకుంటావా అని అడుగుతున్న ఫోటోలే పైవి..
Advertisements
Advertisements
తండ్రి,పెదనాన్న ప్రొడ్యుసర్సే అయినప్పటికి తన తొలిసినిమా పబ్లిసిటి కోసం అమీర్ తన శక్తి మేరకు కష్టపడ్డాడు..1988లో వచ్చిన కయామత్ సే కయామత్ తక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది..తర్వాత ఎన్నో హిట్స్ , ఫట్స్ చూసిన అమీర్ ఇప్పుడు బాలివుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ గా ఎదిగాడు..!