Advertisement
20 మంది సైనికుల ప్రాణాలను పొట్టనపెట్టుకోవడమే కాక…మీరు మా భూభాగంలోకి వచ్చారని బొంకుతున్న…నంగనాచి చైనా తుంగబుర్ర వేషాలను శాటిలైట్ చిత్రాలు బట్టబయలు చేశాయి. 4 రోజుల ముందునుండే పక్కా ప్లానింగ్ తో చైనా ఈ డకోటా పని చేసిందనే ఆధారాలు ఇది.
- భారత్, చైనా సరిహద్దు ప్రాంతమైన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ( LOC )కి 40 కిలోమీటర్ల వెంబడి చైనా మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చింది. ఇదే విషయాన్ని శాటిలైట్ చిత్రాలు కూడా స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.
- భారత జవాన్లపై జూన్ 15వ తేదీన దాడి జరగగా, అంతకు 4 రోజుల ముందే.. అంటే జూన్ 11నే అమెరికాకు చెందిన జియో అనలిటిక్స్ సంస్థ హాక్ ఐ 360 సదరు ప్రాంతంలో శాటిలైట్ చిత్రాలను తీసింది.
Advertisement
- భారత జవాన్లపై దాడి జరగడానికి ముందే లడఖ్‌లోని గాల్వన్ లోయకు అవతలి వైపు చైనా పెద్ద ఎత్తున శిబిరాలను ఏర్పాటు చేసింది.
- చైనా తాను ఆక్రమించిన భారత భూభాగంలో ఏర్పాటు చేసిన బ్రిడ్జిలు, రహదారులు, నీటి మార్గాలు, అందుకు సంబంధించిన యంత్రాలు, టెంపరరీ హట్స్ శాటిలైట్ చిత్రాల్లో రికార్డయ్యాయి.
- చైనా ఆక్రమిత ప్రాంతంలో ముందునుండే అత్యంత భారీ యంత్రాలు, పరికరాలు ఉండడాన్ని ఈ చిత్రాల్లో చూడొచ్చు.!
Advertisements
- భారత్‌పై దాడి చేయాలన్న ఉద్దేశంతోనే చైనా భారత భూభాగంలోకి చొచ్చుకుని రావడంతోపాటు భారత జవాన్లపై ఎదురు దాడి చేసిందని సదరు శాటిలైట్ చిత్రాల డేటా ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది.
Advertisements
- గాల్వన్ లోయలో ఆ సంఘటన జరిగాక అక్కడికి సమీపంలో ఉన్న తమ స్థావరాన్ని చైనా బయటి ప్రపంచానికి కనిపించకుండా చేసింది. కానీ అక్కడ లోలోపల కుట్రలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి చైనా ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే నిజానిజాలేమిటో త్వరలో తెలుస్తాయి.