Advertisement
బిగ్ బాస్ లో తనదైన స్టైల్లో నవ్వులు పూయిస్తున్న అమ్మ రాజశేఖర్ మొదట కొరియోగ్రాఫర్ గా చిత్రసీమకు పరిచయమై, తర్వాత డైరెక్టర్ గా మారి తొలి సినిమానే బ్లాక్ బస్టర్ గా మలిచారు. మొదటి సినిమా తర్వాత ఆయన తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ గానే మిగిలింది.!
అమ్మ రాజశేఖర్ ….డైరెక్ట్ చేసిన 6 సినిమాలు:
రణం – బ్లాక్ బస్టర్:
2006 లో….. గోపిచంద్ , కామ్నాజఠ్మలానీ హీరోహీరోయిన్లుగా అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసిన మూవీ రణం. కథ, స్క్రీన్ ప్లే, యాక్షన్, సాంగ్స్ అన్నీ బాగా కుదిరాయి… సినిమా సూపర్ హిట్ అయ్యింది!
Advertisements
ఖతర్నాక్ -ఫ్లాప్ :
2006 లో….. రవితేజ, ఇలియానా హీరోహీరోయిన్లుగా అమ్మ డైరెక్ట్ చేసిన మరో చిత్రం ఖతర్నాక్. యాక్షన్ జోనర్ లో చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.
టక్కరి -ఫ్లాప్:
2007 లో ….నితిన్ , సదాలను హీరోహారోయిన్లుగా పెట్టి అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసిన 3వ చిత్రం టక్కరి… ఈ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది.
Advertisement
బీభత్సం- యావరేజ్ :
2009లో శశాంక్, మధుశర్మలు హీరోహీరోయిన్లుగా అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసిన 4వ చిత్రం బీభత్సం….విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది.
మ్యాంగో- ఫ్లాప్:
2013లో కృష్ణుడిని హీరోగా పెట్టి తీసిన మ్యాంగో చిత్రం ఫ్లాప్ గా నిలిచింది.
రణం-2- ఫ్లాప్:
2015లో….. అమ్మ రాజశేఖర్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా ఇది! శ్రీహరి, ఆర్తి అగర్వాల్ లు కూడా ఇందులో నటించారు. రణం లాగా హిట్ కొట్టాలని అదే టైటిల్ తో సినిమా తెర కెక్కించినప్పటికీ ఈ సినిమా కూడా ఫ్లాప్ గానే నిలిచింది. ఈ సినిమా తర్వాత అమ్మ రాజశేఖర్ చిత్రసీమకు దూరంగా ఉండిపోయారు.
Advertisements