Advertisement
ఇండియాలోనే గ్రాఫిక్స్ తో వచ్చిన మొట్టమొదటి సినిమా మన తెలుగు సినిమానే! దీన్ని తీయడానికి అప్పట్లోనే 4 సంవత్సరాలు పట్టిందట!
శంకర్ రోబో, రాజమౌళి ఈగ ల కంటే ముందే….ఇండియాలో ఫుల్ లెంత్ గ్రాఫిక్స్ వాడిన ఓ సినిమా ఉంది. ఆ సినిమా తెలుగు సినిమా కావడం నిజంగా మన అదృష్టం. తెలుగోడి టాలెంట్ ను దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చిన సినిమా అది. ఆ సినిమానే అమ్మోరు, ఆ డైరెక్టర్ కోడి రామకృష్ణ. టెక్నాలజీ అంతగా లేని రోజుల్లో తీసిన అమ్మోరు సినిమా క్వాలిటీ చూస్తే ఇప్పటికీ ఆశ్చర్యమేస్తుంది.
సినిమా పూర్తవడానికి 4 ఏళ్ళు:
సౌందర్య 3 వ సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమా రిలీజ్ టైంకి సౌందర్య 27 వ సినిమాగా మారింది అంటే మద్యలో 24 సినిమాలు చేసేసింది సౌందర్య! ఇక అమ్మోరు పాత్రలో రమ్యకృష్ణ నటన నభూతో నభవిష్యత్!
Advertisements
Advertisement
ఆరోజుల్లోనే 1.8 కోట్ల బడ్జెట్ తో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా దాదాపు 11 కోట్లు వసూలు చేసింది . తర్వాత తమిళ్ లో కూడా డబ్ అయిన ఈ సినిమా అక్కడ 1 కోటి వరకు వసూలు చేసింది . హిందీ తో పాటు ఇతర భాషల్లో రిలీజైన ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 2 కోట్ల వరకు వసూలు చేసి . టోటల్ గా ఈ సినిమా 13.5 కోట్ల వరకు షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Advertisements
తండ్రికొడుకులైన… చక్రవర్తి, శ్రీ కొమ్మినేని ఇద్దరూ ఈ చిత్రానికి సంగీతాన్నందిచడం విశేషం.! విఠాలాచార్య సినిమాలు, భైరవద్వీపం ఈ సినిమాకంటే ముందే విడుదలైనప్పటికీ ఫుల్ లెంత్ గ్రాఫిక్స్ ను వాడింది మాత్రం ఈ సినిమాలోనే.! ఈ సినిమా కంటే ముందు జెంటిల్మెన్ సినిమాలోని ఓ సీన్ లో బాంబ్ బ్లా_ స్ట్ లో ఓ యువకుడి హృదయాన్ని గ్రాఫిక్స్ లో చూపించినప్పటికీ ఫుల్ లెంత్ గ్రాఫిక్స్ మూవీ మాత్రం అమ్మోరే!