Advertisement
అంతర్జాతీయ క్రికెట్ లో క్రికెట్ రూల్స్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది. అంపైర్ లు నిర్ణయాలు తీసుకునే వరకు కూడా వాటి గురించి పెద్దగా చర్చ జరగదు. అలాంటి నిర్ణయాలు, రూల్స్ ఒక్కోసారి వివాదాస్పదంగా కూడా మారే అవకాశాలు ఉంటాయి. ఇక క్రికెట్ లో ఎవరికి తెలియని ఒక రూల్ ఉంది. అదేంటో ఒకసారి చూస్తే…
Also Read:సచిన్ ఫస్ట్ మ్యాచ్ ఆడింది పాకిస్తాన్ తరుపునా…? ద్రావిడ్ గంగూలి అనుబంధానికి ఇదే ఉదాహరణ…!
ఒక బ్యాట్స్ మెన్ అవుట్ అయిన అనంతరం… తర్వాత వచ్చే బ్యాట్స్ మెన్ 3నిమిషాలల్లో అంపైర్ కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం అతడిని టైమ్డ్ అవుట్ నిబంధన కింద అవుట్ గా ప్రకటించారు. ఇలా ఔటయిన ఏకైక బ్యాట్స్మెన్ట్ ట్రెంట్ బౌల్ట్. ఆ రికార్డు మన వివిఎస్ లక్ష్మణ్ కు దక్కాల్సి ఉన్నా సరే తృటిలో ఆ అపాయం తప్పిపోయింది. లక్ష్మణ్ బదులు గంగూలీ వెళ్ళి ఆపద తప్పించాడు.
Advertisement
Advertisements
1983 వరల్డ్ కప్ లో జింబాబ్వే తో మ్యాచ్లో ఇలాంటి పరిస్థితే ఎదురు కాగా ఎదురయ్యింది. కపిల్ దేవ్ స్నానం చేయడానికి వెళ్ళి షవర్ తిప్పేసరికి ఒకరు, సబ్బు పెట్టుకునే సరికి ఒకరు షాంపూ కి మరొకరు ఇలా వరుసగా అవుట్ అయ్యారు. 83 సినిమాలో కూడా ఈ సన్నివేశం చూపిస్తారు. ఆ వెంటనే ఆయన తుడుచుకుని వెళ్లి రెడీ అయ్యేసరికి 17 పరుగులకు 5 వికెట్ లు పడ్డాయి. ఆ తర్వాత ఆయన చేసిన 175 పరుగులు… సరికొత్త చరిత్ర సృష్టించాయి.
Advertisements
Also Read:ఈశాన్య దిక్కులో సెప్టిక్ ట్యాంక్ ఉంటే నష్టాలు ఏంటీ…?