Advertisement
అధిక బరువు తగ్గడం అనేది ప్రస్తుత తరుణంలో చాలా మందికి పెద్ద సవాల్‌గా మారింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వాటి నుంచి కొంత వరకైనా తప్పించుకునేందుకు బరువు తగ్గాలని చూస్తుంటారు. ఇక కొందరు ఏ సమస్యలు లేకపోయినా.. బరువు నియంత్రణలో ఉండాలని చెప్పి నిత్యం డైట్ పాటిస్తూ వ్యాయామాలూ గట్రా చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం బరువు తగ్గడాన్ని చాలా షార్ట్ టర్మ్ గోల్ కింద తీసుకుంటారు. దీంతో వారు కేవలం కొద్ది రోజులు లేదా నెలల పాటు డైట్ పాటించి, వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గుతారు. తరువాత తగ్గిన బరువును మెయింటెయిన్ చేయరు.. ఫలితం.. సమస్య మళ్లీ తిరగబెడుతుంది. తిరిగి అధికంగా బరువు పెరుగుతారు. గతంలో ఉన్న బరువు కన్నా అధికంగా బరువు పెరుగుతారు. అవును.. వైద్య నిపుణులు కూడా పదే పదే ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇక ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ విషయంలోనూ ఇది నిజమే అని రుజువైంది. ఎందుకంటే.. అతను మళ్లీ గతంలోలా అధిక బరువు పెరిగాడు..
2017లో అనంత్ అంబానీ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. 18 నెలల పాటు నిత్యం డైట్ పాటిస్తూ వ్యాయామం చేస్తూ 108 కిలోల బరువు తగ్గాడు. అంతకు ముందు అతను 200 కిలోలకు పైగా బరువు ఉండేవాడు. టాప్ మోస్ట్ ఫిట్‌నెస్ ట్రెయినర్, న్యూట్రిషనిస్టులను నియమించుకుని మరీ అతను అంత భారీ మొత్తంలో బరువు తగ్గాడు. అయితే ప్రస్తుతం అతను పలు సందర్భాల్లో కనిపించినప్పుడు తీసిన ఫొటోల్లో మాత్రం మునుపటిలా బరువు పెరిగిన అనంత్‌లా మళ్లీ కనిపిస్తున్నాడు. అయితే కొందరు ఆ ఫొటోలను ఫేక్ అనుకున్నారు. కానీ నిజమే. అతను అప్పట్లో బరువు తగ్గినా.. ఇప్పుడు మళ్లీ బరువు పెరిగి మునుపటిలాగే మారిపోయాడు. దీంతో అతని తాజా ఫొటోలను చూసిన వారు షాక్ తింటున్నారు. అంత భారీ మొత్తంలో బరువు తగ్గిన వ్యక్తి ఉన్నట్టుండి మళ్లీ ఇలా అయిపోయాడేంటబ్బా ? అని ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
Advertisement
Advertisements
అయితే అనంత్ అంబానీ బరువు తగ్గడాన్ని కేవలం షార్ట్ టర్మ్ గోల్‌గానే పెట్టుకున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే.. బరువు తగ్గాక చాలా మంది సెలబ్రిటీలు దాన్ని మెయింటెయిన్ చేయడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తారు. ఉదాహరణకు జూనియర్ ఎన్‌టీఆర్‌నే తీసుకుంటే.. అప్పట్లో బొద్దుగా ఉండేవాడు. తరువాత సన్నగా మారాడు. కానీ తరువాత కొంచెం ఒళ్లు చేసినా బరువును మెయింటెయిన్ చేశాడు. ఫిట్‌నెస్ మంత్రాన్ని పఠించాడు. సిక్స్ ప్యాక్ బాడీ సృష్టించాడు. అలా తన బరువును కంట్రోల్ చేయగలిగాడు. నిజానికి అనంత్ అంబానీ కూడా బరువు తగ్గాక దాన్ని మెయింటెయిన్ చేస్తే.. ఇప్పటికీ చక్కగానే ఉండేవాడు. కానీ బరువు తగ్గాక.. తిరిగి యథావిధి లైఫ్ స్టైల్‌ను కొనసాగించాడు. బరువు తగ్గడాన్ని లాంగ్ టర్మ్ గోల్‌గా కాక, షార్ట్ టర్మ్ గోల్‌గా తీసుకున్నాడు. బరువు తగ్గాం కదా.. ఇంకేముందిలే అనుకున్నాడు.. మళ్లీ యథాప్రకారం లైఫ్ స్టైల్ పాటించాడు. ఫలితంగా.. మళ్లీ బరువు పెరిగాడు. కానీ బరువు తగ్గినప్పటి నుంచి దాన్ని మెయింటెయిన్ చేసి ఉంటే ఇప్పుడు మరోలా ఉండేవాడు. సరిగ్గా నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. బరువు తగ్గడం గొప్ప విషయం కాదు.. దాన్ని మెయిన్‌టెయిన్ చేయడం గొప్ప అని.. అది అనంత్ అంబానీని చూస్తేనే తెలుస్తుంది. చూద్దాం మరి. మళ్లీ అనంత్ నాజూగ్గా మారుతాడో.. లేదో..!
Advertisements