Advertisement
ఇప్పుడంటే భూ అంతర్భాగాల్లో ఉండే వస్తువులు, మనుషులను కనిపెట్టేందుకు నూతన తరహా సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ నిజానికి ఒకప్పుడు కూడా ఇలాంటి పరికరాలు ఉండేవట. చరిత్రకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేసేటప్పుడు సైంటిస్టులకు అనేక కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అందులో భాగంగానే సైంటిస్టులకు మరొక విషయం తెలిసింది. అదేమిటంటే.. భూ అంతర్భాగంలో ఉండే వస్తువులు లేదా భూమి లోపల దాక్కుని ఉండే మనుషులను గుర్తించేందుకు ఒకప్పుడు చుంబక మణి అని ఒక మణిని వాడేవారట. ఇప్పుడు కూడా అలాంటి పరికరాలనే వాడుతున్నారు. కానీ అప్పట్లోనే ఆ వెసులుబాటు ఉండేదట. అయితే సదరు మణిపై ప్రస్తుతం సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు.
క్రీస్తు పూర్వం 4000 సంవత్సరంలో భరద్వాజ మహర్షి బృహద్ వైమానిక శాస్త్రాన్ని రచించారు. అందులోనే చుంబక మణి ప్రస్తావన ఉంది. దాన్ని అనేక పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. వైమానిక శాస్త్రంలో 47 నుంచి 50 వరకు ఉన్న సూత్రాల ప్రకారం.. Fe3O4, ఇసుక, బోరాక్స్, ఏనుగు దంతం, పిప్పలి, పాదరసం, K2CO3, KCLల మిశ్రమం, రాగి, రంజిక్, సోనాముఖి, గృధానిక్, శౌరి, గేదె గిట్టలు, విశ్వకపాలం తదితర పదార్థాలను ఒక్కొక్కటి 10 గ్రాముల చొప్పున తీసుకుని ఫర్నేస్‌లో మండిస్తారు.
ఆయా పదార్థాలను నీటితో శుభ్రం చేసి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పొడి చేస్తారు. మెషీన్‌లో వాటిని వేసి పొడిగా మారుస్తారు. ఈ ప్రక్రియ 24 గంటల పాటు కొనసాగుతుంది. తరువాత వాటిని మళ్లీ ఫర్నేస్‌లో వేడి చేస్తారు. ఫర్నేస్‌లో ఉష్ణోగ్రతను నెమ్మదిగా 1250 డిగ్రీలకు పెంచుతారు. దీంతో పదార్థం మొత్తం ద్రవ రూపంలోకి మారుతుంది. దాన్ని ఒక బాక్స్ లాంటి వస్తువులో పోసి చల్లబరుస్తారు. చల్లబడ్డాక అందులో 25 శాతం పదార్థం అయస్కాంతత్వాన్ని కలిగి ఉంటుంది. దాన్నే చుంబక మణి అని పిలుస్తారు. అది మణిలా మెరుస్తుంది. కనుకనే దానికి చుంబక మణి అని పేరు వచ్చింది.
Advertisement
Advertisements
కాగా భర్వదాజుడి వైమానిక శాస్త్రాన్ని క్రీస్తు పూర్వం 1860వ సంవత్సరంలో స్వామి బ్రహ్మ ముని పరివర్జక్ తిరగరాశారు. అందులో పలు రకాల విమానాల తయారీ గురించి కూడా వర్ణన ఉందట. కాగా ఐఐటీ బాంబేలో ముగ్గురు ప్రొఫెసర్లు అక్కడి కెమిస్ట్రీ విభాగంలో నానో టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నారు. వారు చుంబక మణిని తయారు చేయాలని చూస్తున్నారు. మరి వారి పరిశోధనలు సఫలం అవుతాయో, లేదో చూడాలి. అయితే అంత పురాతన కాలంలోనే అంత అద్భుతమైన జ్ఞానం కలిగి ఉండడం, అంత గొప్ప ఆవిష్కరణలు చేయడం అంటే మాటలు కాదు. అందుకు భారతీయులుగా మనం ఎంతో గర్వ పడాలి.
Advertisements
ప్రస్తుతం పోలీసులు, ఆర్మీ తదితర రంగాలకు చెందిన వారు చుంబక మణి లాంటి పరికరాలను వాడుతున్నారు. అవి ఒక రకమైన తరంగాలను కిందకు విడుదల చేస్తాయి. ఆ తరంగాలు భూమి లోపలికి చొచ్చుకుపోతాయి. దీంతో భూమి లోపల ఏముందో సులభంగా తెలుసుకోవచ్చు. సరిగ్గా చుంబక మణి కూడా అలాగే పనిచేస్తుందని చెబుతున్నారు. ఆయా పరికరాలతో భూ అంతర్భాగంలో ఉండే ల్యాండ్ మైన్లు వంటి వస్తువులను కూడా అలవోకగా గుర్తించవచ్చు. కానీ అప్పట్లోనే ఇంతటి పరిజ్ఞానం ఎలా కలిగి ఉండేవారనేది ఇప్పటికీ సైంటిస్టులకు అంతుబట్టని మిస్టరీగానే మారింది.