Advertisement
విగ్రహం ఏమిటి..? సిటి స్కాన్ చేయడం ఏమిటి ? అని షాకవుతున్నారా ? అయినా ఇది నిజమే. పురాతత్వ శాస్త్రవేత్తలు అత్యంత విలువైన, పురాతనమైన వస్తువులను కచ్చితంగా సిటి స్కాన్ చేస్తారు. ఆ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే అలాగే ఓ విగ్రహాన్ని కూడా వారు సిటి స్కాన్ చేశారు. దీంతో షాకింగ్ విషయం బయట పడింది. ఆ విగ్రహంలో మనిషి శవం ఉన్నట్లు వెల్లడైంది.
నెదర్లాండ్స్‌లోని డ్రెంట్స్ మ్యూజియంలో ఉన్న ఓ పురాతన బుద్ధ విగ్రహానికి పురాతత్వ శాస్త్రవేత్తలు సిటి స్కాన్ చేశారు. దీంతో అందులో సుమారుగా 1000 సంవత్సరాల కిందటి ఓ మనిషి శవం ఉన్నట్లు గుర్తించారు. శవం అనేకంటే దాన్ని మమ్మీ అనడం కరెక్ట్. ఆ మమ్మీని వస్త్రంతో చుట్టారు. ఇక పరిశీలనల అనంతరం తేలిందేమిటంటే.. ఆ విగ్రహం సుమారుగా 11 లేదా 12వ శతాబ్దానికి చెందినదని గుర్తించారు. ఆ మమ్మీ ఓ పురాతన చైనా బౌద్ధ సన్యాసిదని తేల్చారు.
Advertisement
ఇక ఆ మమ్మీకి చుట్టబడిన వస్త్రంపై పురాతన చైనా భాషకు చెందిన అక్షరాలు కూడా రాయబడి ఉన్నాయట. ఆ మమ్మీని.. చైనా మెడిటేషన్ స్కూల్‌కు చెందిన లిక్వాన్ అనబడే ఓ పురాతన బౌద్ధ సన్యాసిగా గుర్తించారు. ఇక ఆ మమ్మీని శాస్త్రవేత్తలు ఇంకా పరీక్షిస్తున్నారు. దాంతో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Advertisements
Advertisements