Advertisement
టివిలో వచ్చిన జోక్ ను విని నవ్వుతున్నాను…వెంటనే మా నానమ్మ…ఇంట్లో నవ్వితే నవ్వావు కానీ బయట అలా నవ్వొద్దు…నిన్నెవరు పెళ్ళి కూడా చేసుకోరు. అసలే నీ చిగుర్లు నల్లగా ఉంటాయి. దానికి తోడు నల్లదైన నీ ముఖంలో నీ పళ్ళు మాత్రమే తెల్లగా కనిపిస్తాయని వారించింది. అద్దంలో చూసుకుంటూ నన్ను నేను ఎన్ని సార్లు తిట్టుకున్నానో లెక్కే లేదు..దేవుడు నన్నెందుకు ఇలా పుట్టించాడోనని ఆయనను కూడా తిట్టేశాను.
Advertisement
ఇదే మాట మా అమ్మతో అంటే…”ఎవరు చెప్పారు అలాగని? ప్రపంచంలో నిన్ను మించిన అందగత్తెలు లేరు. నువ్వు నా గారాల పట్టివి, బంగారు ముద్దవి” అంటూ ఆత్మీయతతో కూడిన ముద్దును పెట్టేది. నాకు తెలుసు అమ్మ అబద్దం చెబుతుందని..ఒకవేళ అమ్మ చెప్పేదే నిజమైతే….నా కోసం అంతంత డబ్బు పెట్టి కాస్మోటిక్స్ కొనకపోయేది…వద్దు అని చెప్పినా పౌడర్లు , ఫెయిర్ అండ్ లవ్లీ కొని మరీ తెస్తుందంటేనే ఆలోచించుకోవొచ్చు…నన్ను అందంగా మార్చడం కోసం ఆమె పడే తపనను.
కానీ మా అమ్మ ప్రేమ ముందు…ఈ అందం….ఈ సమాజం నన్ను చూసే కోణం…ఇవేవీ నేను పట్టించుకోను.!
Advertisements