Advertisement
అమెరికాలోని ఆరిజోనా లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్ మూడవ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో….. స్థానికులందరూ అక్కడ గుమ్మిగూడారు. ఈ క్రమంలో మూడో అంతస్తులోని ఓ మహిళ తన మూడేళ్ళ బాలుడితో కిటికీ దగ్గరకు వచ్చి కేకలు వేస్తుంది.
కిందనే ఉన్న జనం…. చేతిలోని బాలుడిని కిందకు పడేయాల్సిందిగా కోరారు… ఆమె అలాగే చేసింది. కిందపడుతున్న బాలుడిని ఫిలిప్స్ బ్లాంక్ అనే వ్యక్తి… డైవ్ చేస్తూ అందుకున్నాడు. అప్పటికే మంటలంటుకున్న ఆ బాలుడి శరీరం చుట్టూ బ్లాంకెట్ ను కప్పి మంటలార్పారు. తర్వాత హాస్పిటల్ కు తరలించారు.
Advertisement
కొడుకును కిందకు విసిరేసిన తర్వాత తల్లి తన 8 ఏళ్ల కూతుర్ని కూడా సురక్షితంగా కిందకు చేర్చింది… కానీ తను మాత్రం ఆ మంటల్లో కాలి ఆహుతైంది.!
Advertisements
Watch Video:
Advertisements