Advertisement
పురాతత్వ శాస్త్రవేత్తలు అంటేనే ఎప్పుడూ ఎక్కడో ఒక చోట తవ్వకాలు జరపాలి. చరిత్రలో మరుగున పడిపోయిన ఎన్నో విషయాలను, నిర్మాణాలను, శిథిలాలు, శిలాజాలను వారు బయటకు తీయాలి. అయితే కొన్ని సార్లు తవ్వకాల్లో బయటపడే శిలాజాలు వారిని భయపెడతాయి. సరిగ్గా ఆ సమాధులను తవ్విన కొందరు ఆర్కియాలజిస్టులకు కూడా అలాగే భయం కలిగింది. ఎందుకంటే ఆ సమాధుల్లో బయటపడ్డ శిలాజాలు నిజంగానే వారిని అంత భయపెట్టాయి మరి.
చైనాలోని కింగ్ (Qing) వంశానికి చెందిన ఓ మహిళ సమాధిని అక్కడి పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వారు. అందులో ఓ మహిళ శవం శిలాజం రూపంలో అత్యంత భయంకరంగా కనిపించింది. ఆమె ముఖం చార్‌కోల్ అంత నల్లగా ఉంది. ముఖంలో భయానక ఎక్స్‌ప్రెషన్‌తో ఆమె చనిపోయింది. అందువల్ల ఆ ఎక్స్‌ప్రెషన్ అలాగే ఉంది. అది సైంటిస్టులకు భయం కలిగేలా చేసింది. అలాగే ఆమె నోరు పెద్దగా ఓపెన్ అయి ఉంది. కాళ్లు మడతబెట్టబడి ఉన్నాయి. ఆమె శరీరంపై రక్కిన గాయాలు చాలా బలంగా, లోతుగా ఉన్నాయి. దీంతో ఆమె శవాన్ని చూసిన పురాతత్వ శాస్త్రవేత్తలకు విపరీతమైన భయం కలిగింది.
Advertisement
అయితే ఆ శవాన్ని పరిశీలించాక మరొక షాకింగ్ విషయం బయట పడింది. నిజానికి ఆమెను సమాధిలో పూడ్చినప్పుడు ఆమె చనిపోయి లేదు. బతికే ఉంది. ఆమె బిడ్డను ప్రసవించిన అనంతరం స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమె చనిపోయిందని తప్పుగా అర్థం చేసుకుని ఆమెను సమాధి చేశారు. తరువాత సమాధిలో ఆమెకు మెళకువ వచ్చింది. అందులో ఆమెకు ఊపిరి ఆడలేదు. భయంతో బిగ్గరగా కేకలు వేసింది. చేతులతో సమాధి నుంచి బయటకు వచ్చేందుకు యత్నించింది. కానీ వీలు కాలేదు. దీంతో ఆక్సిజన్ అందక చివరకు చనిపోయింది. ఈ విషయాన్ని సైంటిస్టులు ఆమె శవానికి నిర్వహించిన అనాటమీ అనాలసిస్ ద్వారా తెలుసుకున్నారు. దీంతో వారు మరింత భయానికి లోనయ్యారు.
Advertisements
Advertisements
ఇక కిన్ (Qin) చక్రవర్తికి చెందిన సమాధిని తవ్వాక కూడా సైంటిస్టులకు మరొక భయం గొలిపే దృశ్యం కంటబడింది. ఆ సమాధిలో కొన్ని వందల అస్థిపంజరాలు నేలపై పడి ఉండడాన్ని గుర్తించారు. ఆ చక్రవర్తి చనిపోయినప్పుడు అతని శవాన్ని సమాధి చేయడం కోసం ఎంతో మంది అమాయకులను నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా చంపి వారి శవాలను ఆ చక్రవర్తి శవంతో సమాధి చేశారు. అందుకనే ఆ అస్థి పంజరాలు అలా దర్శనమిచ్చాయి. ఇక వాటిని చూస్తే కొన్నింటికి ఎముకలు పూర్తిగా లేవు. కొన్ని అస్థి పంజరాల్లో నోరు పెద్దగా తెరిచి ఉంది. అంటే.. వారిని దారుణంగా హింసించి చంపినట్లు స్పష్టమవుతుంది. ఈ విషయం తెలుసుకుని కూడా సదరు పురాతత్వ శాస్త్రవేత్తలు ఒకింత భయానికి లోనయ్యారు. ఈ రెండు విషయాలను చదివితేనే మనకు భయం వేస్తుంది. ఇక ప్రత్యక్షంగా చూసిన ఆ సైంటిస్టులకు ఎంత భయం కలిగి ఉంటుందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.