Advertisement
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)లో మిర్ గంజ్‌లో జన్మించారు. ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూ స్థానిక కోర్టులో లాయర్‌గా పనిచేసేవారు. అయితే 1970లలో ఆ ఏరియాలో కూల్చివేతలు చేపట్టారు. తరువాత అది రెడ్ లైట్ ఏరియాగా మారింది.
మహమ్మద్ అలీ జిన్నా 1876 డిసెంబర్ 25న సింధ్‌లోని కరాచీలో ఉన్న వజిర్ మంజిల్‌లో జన్మించాడు. అతని తండ్రికి అప్పట్లో గొప్ప వ్యాపారిగా పేరుండేది. బ్రిటిష్ మర్చంట్ కంపెనీ గ్రామ్స్ ట్రేడింగ్‌తో జిన్నా తండ్రి పార్ట్‌నర్‌షిప్‌లో వ్యాపారం చేసేవాడు.
మోతీలాల్ నెహ్రూకు స్వరూప రాణి రెండో భార్య. ఆమె కశ్మీరీ పండిట్. ఆమెకు జవహర్ లాల్ నెహ్రూ జన్మించాడు. ఎంఏ జిన్నా.. మీఠీబాయి, పూంజాభాయ్ జిన్నాలకు జన్మించాడు. నెహ్రూ తన చిన్నతనంలో అలహాబాద్‌లోని 9 ఎల్గిన్ రోడ్, సివిల్ లైన్స్‌తోపాటు ఆనంద్ భవన్ (ఒకప్పుడు మహమ్మద్ మంజిల్) లో గడిపాడు. అయితే ఇప్పుడది స్వరాజ్ భవన్‌గా మారింది.
Advertisements
Advertisement
జిన్నా అప్పట్లో వజిర్ మంజిల్‌లో 16 ఏళ్ల పాటు గడిపి తరువాత ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లాడు.
ఇక నెహ్రూ కన్నా జిన్నా 13 ఏళ్లు పెద్ద. అయితే ఇద్దరూ అప్పట్లో ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్‌ను మెయింటెయిన్ చేశారు. కానీ ఇద్దరూ సోదరులు అయితే కాదు. ఇద్దరూ భిన్న లక్షణాలు కలిగిన వ్యక్తులు. అనేక సార్లు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ వారి మధ్య సోదర సంబంధం లేదు.
Advertisements