Advertisement
నేను NIT లో ఇంజనీరింగ్ చేశాను. సివిల్స్ సాధించాలన్నది నా లక్ష్యం.! అందుకోసం సాఫ్ట్ వేర్ రంగంలో నాకొచ్చిన మంచి ఆఫర్ ను వదులుకొని….టీచింగ్ చేయడానికి ఢిల్లీ వెళ్ళాను. ఎందుకంటే ఢిల్లీ లో ఉంటే నా సివిల్స్ ప్రిపరేషన్ ఈజీ అవుతుందని నా ఆలోచన.!
జూలై 2015…ఓ మోస్తారు కోచింగ్ సెంటర్ లో మ్యాథ్స్ లెక్చరర్ గా చేరాను. నా జీతం ఏడాదికి 6.2 లక్షలు. వెరీ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి టీచింగ్ మీద నాకంత ఇంట్రస్ట్ లేదు, నా లక్ష్యం కూడా వేరేగా ఉండడంతో నిరుత్సాహంగానే నా కెరీర్ స్టార్ట్ అయ్యింది.
ఫిబ్రవరి 2016…రోజు రోజుకు పనిభారం పెరిగిపోతుంది. వారానికి 36 గంటలు టీచింగ్ చేస్తూనే ఉండాల్సి వచ్చేది. చిరాకొచ్చేది, ఇక్కడే కొనసాగితే నాలక్ష్యాన్ని నేను చేరుకోలేను అని నాకర్థమయ్యింది.! అందుకే జాబ్ కు రిజైన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను..పిల్లలకు ఎగ్జామ్స్ అయ్యాక రాజీనామ చేద్దామనుకున్నాను… ఇలాంటి సమయంలో నా ఇన్సిస్ట్యూట్ లో ఓ స్టూడెంట్ కు ఐఐటి లో AIR-384 ర్యాంక్ వచ్చింది. నాకు పట్టరాని సంతోషం… ఎందుకంటే నేను చేరిన మొదటి సంవత్సరంలోనే…అంతకు ముందు ఆ కోచింగ్ సెంటర్ కు ఎప్పుడూ రాని ర్యాంక్ అది.!
ఫిబ్రవరి 2017 ….అప్పటికీ నేను దాదాపు రెండు సంవత్సరాలు అదే కోచింగ్ సెంటర్ లో పూర్తి చేశాను,ఈ క్రమంలో నా జీతం కూడా పెరిగింది. నాజీతం ఏడాదికి 8.2 లక్షలు. శాలరీ పెరిగింది వాస్తవమైనా నా కొలిగ్స్ తో పోల్చుకుంటే తక్కువే.! దీంతో నా ఈగో హర్ట్ అయ్యింది.ఇక్కడ మానేసి వేరే కోచింగ్ సెంటర్స్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నాను. అనుకున్నదే తడవుగా రెండు మూడు కోచింగ్ సెంటర్లకు డెమోలు ఇచ్చి వచ్చాను… కొన్ని రోజుల తర్వాత ఓ టాప్ కోచింగ్ సెంటర్ నుండి ఫోన్ వచ్చింది. నా జీతం ఏడాదికి 15 లక్షలుగా చెప్పారు.
Advertisement
డిసెంబర్ 2017 .
సబెక్ట్ పరంగా మొదట చిరాకుతో ఉన్నప్పటికీ…ఇప్పుడు మ్యాథ్స్ ను ఎంజాయ్ చేస్తున్న…రోజు రోజుకు ఈ రంగంలో కొత్త కొత్త పద్దతులో బోధిస్తుండడంతో…నేనంటే పిల్లలకు వల్లమాలిన అభిమానం. ఇప్పుడు నేను ఆనందించే మరో విషయమేంటంటే…నా స్టూడెంట్స్ లో ఒకరికి…JEE MAINS లో ఇటీవల AIR-94 ర్యాంక్ వచ్చింది. నా జీతం ఏడాదికి 22 లక్షలయ్యింది.! సివిల్స్ అనే నా లక్ష్యం నా పరిధిలో లేదిప్పుడు.! దానికి టైమ్ కేటాయించలేని పరిస్థితి ఇప్పుడు.!!
మే 2018 …….ఇప్పుడు మా కోచింగ్ సెంటర్ లో నేను సీనియర్ ఫ్యాకల్టీ…అండ్ సబ్జెక్ట్ విషయంలో…పిల్లలతో రిలేషన్స్ విషయంలో నాకు తెలిసి… నా స్థాయి ఎక్కడికో పెరిగిపోయింది.! ఇప్పుడు నా డ్యూటీ వారానికి 20 గంటలే.! నా టార్గెట్… JEE MAINS లో టాప్ 10 లో ముగ్గురు నా స్టూడెంట్స్ యే ఉండాలి. ఆ వైపుగా నా బోధనపై దృష్టి సారించాను.
ఒకప్పుడు లైట్ తీసుకుందాం అనుకున్న జాబ్ లో ఇప్పుడు పూర్తి సంతృప్తిగా ఉన్నాను…. ప్రజలకు సేవ చేయడం కోసం నే పెట్టుకున్న సివిల్స్ లక్ష్యాన్ని అందుకోలేకపోయాను..కానీ మరో రెండేళ్ళల్లో ఉచితంగా ఆన్ లైన్ క్లాస్ లు చెబుతూ పేద విద్యార్థులను ర్యాంకర్లుగా మలచాలన్నదే నా కోరిక. చూద్దాం… నా కోరిక ఏ మేరకు సక్సెస్ అవుతుందో.!!
Advertisements
Advertisements