Advertisement
అరిజిత్ సింగ్.. “ఆషికి-2” పాటలతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సింగర్..బాలివుడ్ సింగర్ అయినప్పటికి ఆల్ ఓవర్ ఇండియాలో అరిజిత్ పాటలంటే పడిచచ్చే వాళ్లున్నారు.. ఆషికిలో “తుమ్ హి హో”, సిటిలైట్స్ మూవీలో “ముస్కురానే కీ వజా” సాంగ్స్ ఇప్పటికి టాప్ మోస్ట్ మెలోడి లిస్ట్ లో నంబర్ వన్ స్థానంలో ఉంటాయి.. అరిజిత్ పాటల్లానే..తన లవ్ స్టోరీ కూడా అందరిని ఆకట్టుకుంటుంది..
తబలా కళాకారుడిగా కెరీర్ ప్రారంభించిన అరిజిత్ తర్వాత పాటలు పాడడం వైపు అడుగులు వేసాడు.. ఫేమ్ గురుకుల్ ప్రోగ్రామ్లో అరిజిత్ ని గుర్తించిన సంజయ్ లీలా బన్సాలి “సావరియా” సినిమాలో అవకాశం ఇచ్చాడు..తర్వాత సింగర్ గా మెల్లిమెల్లిగా ఒక్కో స్టెప్ ఎక్కుతూ పైకెదిగిన అరిజిత్ కెరీర్ సూపర్ గా సాగిపోయింది..కానీ పర్సనల్ లైఫ్ మాత్రం కొంచెం గజిబిజిగానే గడిచింది.. సింగర్ గా ప్రయత్నాలు మొదలు పెట్టిన తొలినాళ్లలోనే తన కో సింగర్ ని 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అరిజిత్..కానీ వివిధ కారణాల రిత్యా అదే ఏడాదిలో వారు విడాకులు తీసుకున్నారు.
Advertisement
తర్వాత ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్న అరిజిత్ లైఫ్ లోకి కోయెల్ రాయ్ వచ్చింది..ఈమె ఎవరో కాదు అరిజిత్ బాల్య స్నేహితురాలు..అప్పటికే పెళ్లై , బాబు ఉన్న కోయెల్ భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది.. వీరిద్దరి స్నేహం మళ్లీ కంటిన్యూ అయింది.. బాల్యస్నేహితురాలు తనను అర్దం చేసుకున్న వ్యక్తిగా కోయెల్ ని ఇష్టపడడం స్టార్ట్ చేశాడు అరిజిత్…అదే విషయాన్ని కోయెల్ తో చెప్తే మొదట అంగీకరించలేదు..
Advertisements
Advertisements
ఒకరోజు కోయెల్ ని కలిసి తన ప్రేమ విషయాన్ని ప్రస్తావించి ఆషికి-2లోని హమ్ తేరే బిన్ అబ్ రహ్ నహీ సక్తే.. అబి తుమ్ హి హో అంటూ పాటందుకున్నాడు.. ఆ పాటకు ఫిదా అయిన కోయెల్ అరిజిత్ ప్రేమకి వెంటనే ఎస్ చెప్పిందట.. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి ఉంటున్నారు. పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ బయట పెట్టని అరిజిత్ ఫస్ట్ టైం తన ప్రేమ గురించి చెప్తూ, కోయెల్ మరియు తన బాబుతో దిగిన ఫోటోని పోస్ట్ చేశాడు.