Advertisement
ఆషాడమాసంలో కొత్తగా పెళ్లైన జంటను దూరంగా ఉంచుతారు… ఈ మాసంలో అత్త కోడలి ముఖం చూడొద్దంటారు…. అలాగే కొత్త అల్లుడు అత్త ముఖం చూడొద్దంటారు.! అసలు ఈ నియమం వెనుక కారణాలేంటో లాజికల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.!
వ్యవసాయం కోసం : ఆషాడ మాసంలో వర్షాలు ప్రారంభమౌతాయి.! ఈ సమయంలో వ్యవసాయానికి సంబంధించిన పనులు ఎక్కువగా ఉంటాయి. ఇదే టైమ్ లో నూతన వధూవరులు ఒకచోట ఉంటే భర్త భార్య ధ్యాసలో ఉండి వ్యవసాయం మీద దృష్టి సారించడు…దీంతో జీవనాధారం దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో…. భార్య భర్తలు దూరం పాటించేందుకు ఈ నియమాన్ని తెచ్చారని కొందరి అభిప్రాయం.!
Advertisements
Advertisement
వాధ్యుల సీజన్ : వర్షాకాలం వ్యాధుల సీజన్….ఈ టైమ్ భార్యభర్తలు శారీరకంగా కలిస్తే….భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశముంటుంది. కడుపులోని శిశువుపై సీజనల్ వ్యాధుల ప్రభావం పడకూడదని ఈ గ్యాప్ మెయింటేన్ చేస్తారని కొందరు… ఒకవేళ పిల్లలు పుడితే కరెక్ట్ గా వచ్చే వర్షాకాలంలోనే పుడతారు అప్పుడు వచ్చే వ్యాధులను తట్టుకునే ఇమ్యూనిటీ పవర్ పిల్లల్లో ఉండదనేది ఇంకొందరి అభిప్రాయం.!
Advertisements
సెక్స్ మీద విరక్తి కలగకుండా….!? కొత్తగా పెళ్లైన జంట సహజంగానే సెక్స్ లో ఎక్కువగా పాల్గొంటారు. ఇది ఇలాగే కొనసాగితే… సెక్స్ మీద విరక్తి కలుగుతుంది. సంసార జీవితం నిస్సారమౌతుంది.! అందుకనే భార్యభర్తల మద్య సెక్సువల్ గ్యాప్ కోసం ఇలా చేస్తారని ఇంకొందరి ఒపినీయన్.!