Advertisement
నిజానికి ఇది చాలా మంచి ప్రశ్న.. దేశంలో అనేక రంగాల్లో కొన్ని కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందరూ అవినీతి పరులని చెప్పలేం. కొందరు నిజాయితీ పరులు కూడా ఉంటారు. వారు జీవితాంతం నిజాయితీగానే పనిచేస్తారు. అయితే అలా నీతి నిజాయితీలను కలిగి ఉండేవారు అసలు సమాజంలో జీవించ గలరా ? నేటి తరుణంలో అవినీతి చేస్తేనే కదా బతికేది. అలాంటిది.. అవినీతి చేయకుండా ఎలా బతకగలుగుతారు ? వారిని సమాజం అలా బతకనిస్తుందా ? అంటే.. అవును.. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే అవినీతి చేయాల్సిన పనిలేదు. నీతి నిజాయితీలతో ఉన్నా.. టైముకు అందాల్సిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇతర ప్రయోజనాలు కచ్చితంగా అందుతాయి. అందుకు అడ్డదారులు తొక్కాల్సిన పనిలేదు. దానికి ఈ IAS జీవితమే చక్కని ఉదాహరణ.
ఐఏఎస్ అధికారి అశోక్ ఖెమ్కా నీతి నిజాయితీలకు మారుపేరుగా ఉన్నారు. ఈయన గతంలో ఎన్నో స్కాంలను బయటకు తీశారు. భూపీందర్ హుడా హయాంలో రాబర్ట్ వాద్రా డీఎల్ఎఫ్ స్కాం, సోనెపట్ ఖార్ఖొడా ఐఎంటీ ల్యాండ్ స్కాం, గర్మి సంప్లా ఉద్దర్ గగన్ ల్యాండ్ స్కాం.. ఇలా అనేక స్కాంలను అశోక్ బయటకు తీశారు. నవంబర్ 2019 వరకు ఆయన తన 28 ఏళ్ల కెరీర్‌లో మొత్తం 53 సార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఎందరో నాయకులు, బడాబాబుల అవినీతి బాగోతాలను బయటపెట్టారు. ఏ విభాగంలో పనిచేసినా అందులో ఉన్న అవినీతిని వెలికితీయడమే ఆయన పనిగా పెట్టుకునేవారు.
Advertisement
అయితే అశోక్ ఖెమ్కా.. అన్ని ప్రభుత్వాల్లో.. అందరు రాజకీయ నాయకులకు కొరకరాని కొయ్యగా.. కంటగింపుగా మారినా.. ఆయనకు అందాల్సిన ప్రయోజనాలన్నీ అందుతున్నాయి. అలా అని చెప్పి ఆయన ఉద్యోగంలో డిమోట్ కాలేదు. ప్రమోట్ అయ్యారు. హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇక ఆయన తన బ్యాచ్ ఐఏఎస్ అధికారుల్లాగే అన్ని ప్రయోజనాలను పొందుతున్నారు. నీతి నిజాయితీలతో ఉంటే.. ప్రమోషన్లు రావని… కెరీర్‌లో ఎదగలేమని.. అనుకునేవారే అడ్డదారులు తొక్కుతారు. అవినీతి పాల్పడుతారు. అవేవీ చేయాల్సిన అవసరం లేకుండా.. నిజాయితీగా ఉంటే చాలు.. రావల్సినవన్నీ టైముకు వస్తాయి. ఇది చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు అర్థం కాదు.
Advertisements
ఇక కొందరు ఉద్యోగులు ఆరంభంలో నీతి నిజాయితీలతో ఉన్నా.. తరువాత వాళ్లు అవినీతికి పాల్పడుతారు. అయితే కొందరు కావాలనే వారిని అలా అవినీతికి పాల్పడేలా మారుస్తారనేది పొరపాటు. ఎందుకంటే.. అవినీతి చేయాలన్నా.. నీతిగా బతకాలన్నా.. ఎవరి నిర్ణయం వారిదే. అందుకు ఎవరూ బలవంత పెట్టలేరు. పెట్టబోరు కూడా. కాకపోతే కొన్ని పరిస్థితుల్లో కొందరు అవినీతి చేయక తప్పదని సమర్థించుకుంటూ ఆ ఉచ్చులోకి దిగుతారు. అయినప్పటికీ నీతిగా బతికే వారి కన్నా.. అవినీతి చేసేవారే ఎక్కువగా సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఇప్పటికీ అనేక మంది ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, ఇతర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది అనేక కేసుల్లో చిక్కుకుని కోర్టుల చుట్టూ తిరుగుతుండడాన్ని మనం ఇప్పటికీ చూస్తున్నాం. అవినీతి అనేది ఎవరో చెబితే చేసేది కాదు. నీతిగా ఉండడమనేది తప్పు కాదు. అవి సొంత నిర్ణయాలు. కానీ.. నీతిగా ఉంటేనే.. దక్కాల్సిన లాభాలు దక్కుతాయి.
Advertisements