Advertisement
ఈ ఫోటో చూడగానే అప్రయత్నంగానే మన కంటినుండి కూడా నీరు కారుతుంది కదూ.! నిజంగానే ఆ పాప కన్నీటి వెనుక కూడా అంతకంటే బలమైన కారణమే ఉంది. తన తండ్రిని కోల్పోయిన బాధ ఉంది. ఈ ఫోటో 2017 లోది. కాశ్మీర్ లోని అనంతనాగ్ లో ASI గా పనిచేస్తున్న అబ్దుల్ రషీద్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. స్కూల్ నుండి వచ్చాక తన తండ్రి లేడని తెలుసుకున్న ఆ పాప గుండె తరుక్కుపోయేలా రోదించింది. ఈ ఫోటో ఎందరో హృదయాలను కదిలించింది.
Advertisement
గౌతం గంభీర్ సైతం ఈ ఫోటో చూసి చలించి… తన చదువుకు అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానన్నాడు . ఆ సందర్భంగా గంబీర్ చేసిన ట్వీట్ లో కూడా అంతే ఆర్ధ్రత నిండి ఉంది.. జోహ్ర., ఈ సమయంలో నిన్ను జోలపాట పాడి నిన్ను నిద్రపుచ్చలేను , కానీ నీ కలలను మాత్రం తట్టిలేపగలను. డాక్టర్ కావాలని కలలు కంటున్న ఆ పాప లక్ష్యం నెరవేరాలని కోరుకుందాం.!
Advertisements
Advertisements