Advertisement
సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు అతి ముఖ్యమైన విభాగం డైరెక్షన్ డిపార్ట్మెంట్. ప్రి ప్రొడక్షన్ , ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా ప్రతిచోట డైరెక్షన్ డిపార్ట్మెంట్ కృషి చాలా ముఖ్యం. ఈ డైరెక్షన్ టీమ్ లో కొంత మంది డైరెక్టర్ ఆదేశాలనుసారం పనిచేస్తూ సినిమా నిర్మాణంలో డైరెక్టర్ పనిని ఈజీ చేస్తుంటారు.
డైరెక్టర్ కింద సహాయకులు:
- అప్రెంటిస్ :
- అసిస్టెంట్ డైరెక్టర్
- అసోసియేట్ డైరెక్టర్
- కో డైరెక్టర్
అప్రెంటిస్ : అప్రెంటిస్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై ఎటువంటి అనుభవం లేకుండా కేవలం పని నేర్చుకోవడం కోసం జాయిన్ అవుతారు . నిజానికి వారికి షూటింగ్ లొకేషన్ లో ఎక్కువ పనులు ఉండవు . కేవలం ఫైల్స్ అందించడం , అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇచ్చే పనులు చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండడమే వారి పని .
కో డైరెక్టర్ : కో డైరెక్టర్ అంటే డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ లాంటివాడు . డైరెక్టర్ ప్రతీ సీన్ ని కోడైరెక్టర్ తో డిస్కస్ చేస్తాడు . డైరెక్టర్ చెప్పిన ప్రకారం కోడైరెక్టర్ , అసోసియేట్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్స్ సహాయంతో లొకేషన్ మరియు ఆర్టిస్ట్ లను ప్రిపేర్ చేసి ఉంచుతారు .
Advertisements
Advertisement
అసిస్టెంట్ డైరెక్టర్:
అసిస్టెంట్ డైరెక్టర్ ముఖ్యంగా తన పైన ఉన్న అసోసియేట్ మరియు కో డైరెక్టర్ ఆదేశాల ప్రకారం లొకేషన్ ని రెడీ చేస్తారు . అంతే కాదు అసిస్టెంట్ డైరెక్టర్ కి క్లాప్ బోర్డ్ వాడే విధానం కూడా బాగా తెలిసుండాలి . అలాగే ప్రతీ సీన్ లో యాక్టర్స్ కాస్ట్యూమ్స్ అండ్ ప్రాపర్టీస్ కంటిన్యుటీ చూసుకుంటూ ఉండాలి . అలాగే తర్వాత తీయబోయే సీన్ ఏంటో కో డైరెక్టర్ ద్వారా తెలుసుకొని లొకేషన్ మరియు జూనియర్ ఆర్టిస్ట్ లని ప్రిపేర్ చేసి ఉంచాల్సి ఉంటుంది . కొన్నిసార్లు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు వారి డైలాగ్స్ అండ్ పెరఫార్మెన్స్ గురించి వివరించాల్సి ఉంటుంది .
అసిస్టెంట్ డైరెక్టర్స్ శాలరీ:
Advertisements
పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ లో చేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ కి నెల నెల జీతంలా ఇస్తుంటారు . అది ఎంత అనేది ఆ ప్రొడక్షన్ హౌస్ ను బట్టి, అలాగే అతని అనుభవాన్ని బట్టి ఉంటుంది. చిన్న చిన్న ప్రొడక్షన్స్ అయితే ప్రాజెక్ట్ కి ఇంత అని ముందే మాట్లాడుకుంటాయి. ప్రస్తుతం కొన్ని చిన్న సినిమాలకు మాత్రం అసిస్టెంట్ డైరెక్టర్స్ కి ఎటువంటి జీతం ఇవ్వకుండా కేవలం భోజనం మరియు వసతి ఇస్తూ ఫ్రీగా పనిచేయించుకుంటున్నారు .