Advertisement
ఈ రోజు డాంబికాలు పలుకుతున్న చైనాకు … 1967 ప్రాంతంలో అప్పుడు MP గా ఉన్న అటల్ బీహారీ వాజ్ పేయ్ గొర్రెల సహాయంతో చుక్కలు చూపించాడు. ప్రపంచ దేశాల ముందు చైనా చిల్లర రాజకీయాలను క్లియర్ గా తెలిసేలా చేసి…చైనాను సిగ్గు పడేలా చేశాడు.
అసలేం జరిగింది?
1962 లో చైనా- భారత్ యుద్దం తర్వాత రెండు దేశాల మద్య సఖ్యత దెబ్బతింది. 1967 లో మరో మారు చైనా సిక్కిం ప్రాంతం గుండా ఇండియాలోకి జొరబడే ప్రయత్నం చేసింది. అప్పుడు మన సైనికులు వారికి గట్టిగానే బుద్దిచెప్పారు.
ఈ సమయంలో ….ఇండియాలో ఉన్న చైనా రాయబార కార్యాలయాన్ని ఇక్కడి ప్రజలు, చైనా లో ఉన్న ఇండియా రాయబార కార్యాలయాన్ని అక్కడి ప్రజలు ముట్టడించి నిరసనలు తెలుపుతున్న క్రమంలో… ..రాయబార కార్యలయాల ముట్టడిని ఆపివేయాలని ఇరుదేశాలు అంగీకరించాయి.
Advertisement
అదే సమయంలో ఇండియా సైనికులు తమ ప్రాంతం నుండి 800 గొర్రెలను దొంగిలించారని ఆరోపించింది చైనా ప్రభుత్వం. ( దొంగచాటుగా ఇండియన్ భూభాగంలోకి ప్రవేశించి…టాపిక్ ను డైవర్ట్ చేయడానికి గొర్రెలను అడ్డం పెట్టుకుంది)
Advertisements
Advertisements
అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జన్ సంఘ్ పార్టీ MP ( గ్వాలియర్ ) గా ఉన్న అటల్ బీహారీ వాజ్ పేయ్…ఢిల్లీ లో ఉన్న చైనా రాయభార కార్యాలయానికి 800 గొర్రెలను తీసుకెళ్ళి నిరసన తెలిపారు… ప్రతి గొర్రె మెడలో …. “Eat me but save the world అనే ఫ్లకార్డ్ వేలాడదీశాడు. ఈ వింత నిరసన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. “గొర్రెల కోసం చైనా యుద్దం?” అంటూ వివిధ దేశాల పత్రికలు సైతం చైనాను ఎండగట్టాయి. దీంతో ప్రపంచదేశాల ముందు చైనా చిన్నబోవాల్సి వచ్చింది.!