Advertisement
ప్రజాస్వామ్యంలో బతికే మనకు దాని విలువ తెలియకపోవచ్చు..కానీ అసలు ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందో తెలియని, దాన్ని కాపాడుకోలేని వ్యవస్థల్లో ఒక మనిషి బతుకు ఎంత దుర్బరంగా ఉంటుంది అనే దానికి ఈ ఒక్క ఘటన అద్దం పడుతుంది.. మూడేళ్లపాటు అత్యాచారానికి గురైన 16ఏళ్ల అమ్మాయి నడిరోడ్డు మీద బహిరంగంగా ఉరితీయబడింది??దానికి గల కారణాలేంటో తెలుసా..
అతేఫే రాజాబి సహాలేహ్ అనే పదహారేళ్ల ఇరానియన్ అమ్మాయి కథ..
51 ఏళ్ల అలీ దరాబి అనే ట్యాక్సి డ్రైవర్ చేతిలో మూడేళ్ల పాటు రేప్ కి గురైంది అతేఫె.. అప్పటికే పెళ్లై ,పిల్లలు ఉన్న అలీ తనపై చేస్తున్న అఘాయిత్యాన్ని ఎవరికి చెప్పుకోలేకపోయింది.. చెప్తే ఎక్కడ తనని తప్పు పడతారో అనే భయం… తన భయమే నిజమైంది.. బాధ తట్టుకోలేక ఒక సారి భయపడుతూనే జరిగిన విషయం బయటికి చెప్పింది..అలీ దరాబికి ఎలా అయినా శిక్ష పడుతుందని భావించింది..కానీ అందుకు భిన్నంగా అతేఫాని అరెస్ట్ చేసారు.
అలీ దరాబికి శిక్ష పడడానికి బదులుగా అతేఫే ని అరెస్ట్ చేయడానికి గల కారణం… ఇస్లామిక్ షిరియా చట్టాల ప్రకారం దరాబి రేప్ చేసేలా అతేఫేనె ప్రోత్సహించిందనేది ఆరోపణ.. అక్కడితో ఆగకుండా జైలులో గార్డుల చేత పలుమార్లు అత్యాచారానికి గురైంది..అదే విషయాన్ని తనని చూడడానికి వచ్చిన అమ్మమ్మ తో చెప్పుకుని మొరపెట్టుకుంది..భరించలేని నొప్పి కారణంగా నడవలేకపోతున్నానని బోరున ఏడ్చింది..
Advertisements
అతెఫ్ కేస్ కోర్ట్ హియరింగ్ కి వచ్చినప్పుడు జడ్జి స్థానంలో హజీ రేజయ్ ఉన్నారు..వాదోపవాదాలు జరుగుతుండగానే తాను కేసులో ఓడిపోతానని, అలీ దరాబికి శిక్ష పడదని భావించిన అతెఫ్ ఒక్కసారిగా తన హిజాబ్ ని తీసి విసిరేసింది..అంతేకాదు జడ్జిపైకి తన చెప్పులను విసిరేసింది..దాంతో ఇది రాజ్య ధిక్కారం కింద పరిగణించి అతెఫ్ కి బహిరంగ ఉరిశిక్షను ఖరారు చేసారు..
Advertisement
ఆగస్టు 15, 2004న..బహిరంగంగా ఉరితీయబడ్డ అతెఫె..
ఆగస్ట్ 15,2004 లో నడిరోడ్డుపై వందలాదిమంది చూస్తుండగా అతెఫ్ ని ఉరి తీసారు..మగవాళ్ల చేతిలో అత్యాచారానికి గురైన ఒక అమ్మాయికి ఇరాన్ చట్టం వేసిన శిక్ష అది.కేవలం అతెప్ మాత్రమే కాదు..ఎంతో మంది ఇలా చిన్న చిన్న కారణాలకు ఉరితీయబడ్డారు..వారిలో చిన్నపిల్లలు కూడా ఉండడం విచారకరం.. బహిరంగ ఉరిలను వ్యతిరేకిస్తూ వందలాదిమంది రోడ్లపైకి వస్తే ప్రొటెస్ట్ చేసిన అందరిని అణిచివేసేందుకు ప్రయత్నించింది ఇరాన్ ప్రభుత్వం.. ఆ ప్రోటెస్ట్ లలో 1500 మందికి పైగా మరణించారు..ఇప్పటికి అక్కడ బహిరంగ ఉరి అమలవుతూనే ఉంది..ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో…ఇస్లామిక్ చట్టాల అమలు ఫలితాలు ఎంత విషాదకరంగా ఉంటాయో తెలిపే అత్యంత దయనీయమైన ఉదాహరణ ఇది.. ఇలాంటప్పుడే వందమంది దోషులు తప్పించుకున్నా కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదనే విలువైన న్యాయ సూత్రాల అవసరం సమాజానికి ఏ స్థాయిలో ఉందో తెలుపుతోంది.బాధితురాలే దోషిగా అమానుష శిక్షలకు బలవ్వడం సమాజంలోని దుర్మార్గపు విలువలకు అద్దం పడుతోంది..!
Advertisements