Advertisement
టెన్షన్ గా ఉంది.. నిద్రపట్టట్లేదు…ఆలోచనలన్ని రేపు ఉదయం కలవాల్సిన వ్యక్తి గురించే.. తను నన్ను చూడగానే ఏం మాట్లాడతారు..ఏం క్వశ్చన్స్ అడుగుతారు..నేనేం సమాధానం ఇవ్వాలి.. తనే ముందు మాట్లాడతారా? నేను మాట్లాడాల్సి ఉంటుందా?? తనకి నేను నచ్చుతానో లేదో.. అనే ఆలోచనలో ఏ అర్దరాత్రో నిద్రపోయా..
నైట్ లేట్ పడుకోవడంతో..ఉదయం లేట్ లేచా..తనని కలుస్తానని చెప్పిన టైం ఆల్మోస్ట్ అయిపోయింది..హడావిడిగా లేచి రెడీ అయి బయల్దేరా..వెళ్లే ముందు నన్ను నేను మళ్లీ ఒకసారి అద్దంలో చూసుకున్నా.. ఈ డ్రెస్లో తను నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో..తనకి నచ్చే విధంగా చీర కట్టుకుని ఉండాల్సిందా.. కానీ ఇప్పుడు చీర కట్టేది ఎవరూ..ఇలా మనసులో ఎన్నో సందేహాలు,ఆలోచనలు..
మొత్తానికి చేరుకున్నా తనని కలిసా..తనని కలిసి మాట్లాడాక నైట్ నుండి నేను అనవసరంగా భయపడ్డా అనిపించింది…ఇంతకీ నేను కలిసింది ఎవర్నో చెప్పలేదు కదూ.. నాకు కాబోయే అత్తగార్ని.. నాతో మంచి చెడు మాట్లాడి నా భయాలన్ని పోగొట్టారు..అప్పుడు ఫస్ట్ టైం తీసుకున్న ఫోటో ఇది.. ఇది జరిగి ఇరవైఏళ్లు..ఆ ఫోటో తీస్కున్నది 1999లో..
Advertisement
నాది కెనడా, మా హబ్బిది ఇండియా.. వర్క్ ప్లేస్లో కలిసాం..ప్రేమలో పడ్డాం..కుటుంబాలకు చెప్పి రెండు వారాల్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాం.. ఈ ఇరవైఏళ్ల కాలంలో ఎన్నో మారాయి..ఉద్యోగాలు.. ఆఫీసుల్లో మా పొజిషన్స్ ..మా ఇద్దరికి తోడు మరో ఇద్దరు చేరి ఒక కుటుంబం ఏర్పడింది..కానీ 20ఏళ్లల్లో మారనిది ఒక్కటే మా అత్తాకోడళ్ల మధ్య ప్రేమ.
Advertisements
ఇది నేను లేటెస్ట్ గా తీసుకున్న ఫోటో .. ఇరవై ఏళ్ల తర్వాత కూడా నా ముఖంలో చిరునవ్వు అలాగే ఉందంటే దానికి కారణం నా కుటుంబం, మా అత్తగారే..2017లో ఆవిడ క్యాన్సర్ కి గురయ్యారు..తర్వాత పార్కిన్సన్స్ తో పోరాడుతున్నారు..అయినా కూడా తనలోని ధైర్యం,తన ముఖంపై చిరునవ్వు కోల్పోలేదు.. నా జీవితంలో మా అత్తయ్యలాంటి ఉన్నతమైన భావాలున్న వ్యక్తిని నేను చూడలేదు..ప్రస్తుతం ఆవిడ పార్కిన్సన్స్ పైనల్ స్టేజ్లో ఉన్నారు..నా ముఖంపై చిరునవ్వు ఉన్నంత వరకు ఆవిడ మాతోనే ఉంటారు.. తన కొడుకుని, తన కొడుకు ద్వారా సంతోషాన్ని నాకిచ్చింది ఆవిడే కదా…!
Advertisements