Advertisement
చుట్టూ చీకటి..తెల్లారితే నా పెళ్లి..రేపు ఈ టైంకి నేను మరో ఇంటి పిల్లని..ఈ ఇల్లు నాకు పరాయిది అయిపోతుంది…ఏవేవో ఆలోచనలు..వాటన్నింటికి సమాధానాలు చెప్పగలిగిన ఒకే వ్యక్తి మా అమ్మ.. సో టైం పన్నెండు అవుతున్నా సరే ఏమాత్రం ఆలోచించకుండా తన బెడ్రూంకి వెళ్లి నిద్ర లేపాను..నిజానికి తను కూడా ఏదో ఆలోచనలోఉన్నట్టుంది..నిద్రపోలేదు..నేను వెళ్లగానే లేచి కూర్చుంది..
నేను తన ఒళ్లో పడుకుని నిశ్శబ్దంగా తననే చూస్తూ ఉన్నాను.. ఏమైంది చిట్టితల్లి ఎందుకు డల్ గా ఉన్నావ్ అని అడిగింది నా కళ్లల్లోకి చూస్తూ..
వెంటనే నా నుండి వచ్చిన ప్రశ్న..అమ్మా , రేపు నేను అత్తింటికి వెళ్లాక వాళ్లు కూడా నా కళ్లను బట్టి నా మనసుని అర్దం చేసుకుంటారా?? ఎందుకు చేసుకోరు…కాకపోతే నువ్వు వారికి ఆ అవకాశం ఇవ్వాలి ,వారితో ప్రేమగా మసలుకోవాలి..నువ్వు వాళ్ల పిల్లవి అనిపించుకోవాలి..నువ్వు వాళ్ల సమస్యలను అర్దం చేస్కోగలిగితే వాళ్లు కూడా నిన్ను ఓన్ చేసుకుని నీ మనసు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు..
వాళ్లు నా లైఫ్ స్టైల్ బాగాలేదని తిడితే..దీనికోసం పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదురా, ప్రతి ఒక్కరికి వారి వారి లైఫ్ స్టైల్ ఉంటుంది.. అని వాళ్లని కన్వీన్స్ చేయడానికి ప్రయత్నించు..ఏదైనా నవ్వుతూనే చేయాలి అని నా తల నిమురుతూ అమ్మ చెప్తుంది.. అమ్మ సమాధానం కంప్లీట్ అయిన వెంటనే..వాళ్లు నన్ను వంట చేయమంటే ఏం చేయాలి..నేనిక్కడ అసలు ఎప్పుడూ వంటే చేయలేదే..దానికి బాధపడడం ఎందుకు ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు ఉత్సాహంగా ఉండాలి,ఒకటి గుర్తు పెట్టుకో మనం నేర్చుకునేది ఏది అయినా మనకు ఉపయోగపడుతుంది.
Advertisements
Advertisement
పెళ్లి తర్వాత ఉద్యోగం మానేయమని మా అత్తమామలంటే అని మరో ప్రశ్న అడిగాను..ముందు నీ హజ్బెండ్ ని అడుగు తను కూడా నువ్వు ఉద్యోగం మానేయాలని కోరుకుంటున్నాడేమో తెలుసుకో..తను కూడా అదే కోరుకుంటే రీజన్ తెలుసుకో..ఒక వేళ రీజన్ వాలిడ్ అనిపించిందనుకో నిర్ణయం తీసుకో..వాళ్లు చెప్పే కారణంలో అర్దం లేదు అనుకుంటే వాళ్లకి నచ్చచెప్పడానికి ప్రయత్నించు..
అత్తమామాల గురించే నాకుభయంగా ఉంది..వాళ్లని నేను ఎలా ఇంప్రెస్ చేయాలి..ఒకటి గుర్తు పెట్టుకో చిట్టితల్లి నువ్వ ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు..నువ్వు నువ్వగానే ఉండు.. ఒకరిని ఇంప్రెస్ చేయడానికి నిన్ను నువ్వు మార్చుకుంటూ ఉంటే అక్కడే అసలు సమస్యలు స్టార్ట్ అవుతాయి..పిల్లల నుండి పెద్దలు కోరుకునేది కేవలం రెస్పెక్ట్,ప్రేమ మాత్రమే..అవే నువ్వు పంచితే ఇంక నువ్వు ప్రత్యేకంగా ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏముంటుంది..
పెళ్లి తర్వాత మా ఆయనలో మార్పు వస్తే.. చూడమ్మా, భార్యాభర్తలన్నాక చిన్నచిన్న గిల్లికజ్జాలు సహజం,నేను మీ నాన్న ఎప్పుడూ గొడవపడలేదా,మీ అన్నయ్య వదినలు ఎప్పుడూ అరుచుకోలేదా..అంతెందుకు నీ బెస్ట్ ఫ్రెండ్ కూడా తన హజ్బెండ్ తో గొడవపడితే ఇద్దరూ నీ దగ్గరకొచ్చే రాజి పడతారు కదా.. కాబట్టి భార్యాభర్తలన్నాక గొడవలు సహజం,మళ్లీ కలిసిపోవడం సహజం..
ఒకటి గుర్తు పెట్టుకో చిట్టితల్లి, నువ్వు ఆ ఇంటిని నీ ఇల్లుగా,వాళ్లని నీ వాళ్లుగా భావిస్తే ఏ సమస్యరాదు.. మీరు నన్ను మిస్ అవుతారా అమ్మ మాటల్ని మధ్యలోనే ఆపి అడిగా కన్నీళ్లను తుడుచుకుంటూ…ఎందుకు మిస్ అవుతాము..రేపటి నుండి నీకు ఇద్దరమ్మలు,ఇద్దరు నాన్నలు, రెండు ఇల్లులు, నిన్ను బాగా చూసుకునే నీ భర్త.. సో మేము నిన్నెక్కడ మిస్ అవుతాము,అస్సలు మిస్ కాము కంటినీటిని తుడుచుకుంటూ చెప్తోంది..
ఇంతలో డోర్ సౌండ్ అయింది.. నీకు ఏ సమస్య వచ్చినా అక్కడ మేమెప్పుడూ ఉంటామమ్మా.. డోర్ దగ్గర నిలబడిన నాన్న నా దగ్గరకు వచ్చి నుదుటిపై ముద్దు పెట్టాడు.. అమ్మతో మాట్లాడాక తన మాటలు, నాన్న ఇచ్చిన భరోసా రేపటి గురించి టెన్షన్ లేకుండా చేశాయి.. అత్తింట్లో నేను అమ్మ మాటలప్రకారమే నడుచుకోవాలనుకుంటున్నా..అంతా మంచే జరుగుతుందని కోరుకుంటూ అమ్మ ఒళ్లోనే నిద్రపోయా..!
Advertisements