Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

5,204 నర్సింగ్ పోస్టులకు 40,936 మంది దరఖాస్తు!

Advertisement

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్‌లో 5,204 నర్సింగ్ పోస్టులకు నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేయ‌గా మొత్తం 40,936 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప‌రీక్ష‌ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB), ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా నిర్వహిస్తుంది. MHSRB విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కింద 3,823 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP)లో 757, MNJ క్యాన్సర్ హాస్పిటల్‌లో 81, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ విభాగంలో 8 పోస్టులు ఉన్నాయి. , తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ సొసైటీలో 127, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలో 197, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలో 74 మరియు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషనల్ సొసైటీలో 13 పోస్టులున్నాయి.

Advertisements

క‌రెంట్ ఎఫైర్స్ రివిజ‌న్ -1

Questions :

1) ఇంట‌ర్నేష‌న్ ఇంట‌లెక్చువ‌ల్ ప్రాప‌ర్టీ ఇండెక్స్ లో ఇండియా స్థానం?

2) వ‌రల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఇండియా స్థానం ?

3) 2023 రిప‌బ్లిక్ డే చీఫ్ గెస్ట్ ఎవ‌రు?

4) ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో విద్య‌ను పూర్తిచేసిన అమ్మాయిల ఉన్న‌త విద్య‌కోసం నెల‌కు 1000రూపాల‌య‌ను స్కాల‌ర్ షిప్ గా ఇస్తున్న రాష్ట్రం ?

5) వ‌న్ ఫ్యామిలీ వ‌న్ ఐటెంటిటీ అనే పోర్ట‌ర్ ను ప్రారంభించిన రాష్ట్రం ?

6) లాడ్లీ బెహ‌నా స్కీమ్ ను ప్రారంభించిన రాష్ట్రం?

7) జాగా మిష‌న్ స్కీమ్ కు గాను ఒడిషాకు 2023 వ‌ర‌ల్డ్ హ‌బిటాట్ అవార్డు ల‌భించింది. జాగా మిష‌న్ దేనికి సంబంధించిన‌ది?

8) బోధ‌కాలు వ్యాధి ఇండియానుండి ఎప్ప‌టి వ‌ర‌కు అంత‌మ‌వ్వ‌నుంది?

9) ఉప‌గ్ర‌హాల సంఖ్య అధికంగా ఉన్న గ్ర‌హం?

Advertisement

10) విమెన్ ప్రీమియ‌ర్ లీగ్ విజేత

Answers : 
స‌మాధానాలు & వివ‌ర‌ణ :

1) 42వ స్థానం, ఈ ఇండెక్స్ ను యుఎస్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ విడుద‌ల చేస్తుంది.

2) 126, UN SDSN- UN స‌స్టైన‌బుల్ డెవ‌లప్మెంట్ సొల్యూష‌న్స్ నెట్ వ‌ర్క్ విడుద‌ల చేసే ఈ రిపోర్ట్ లో మొత్తం దేశాల సంఖ్యం 146. ఫిన్లాండ్ 6 సంవ‌త్స‌రాల నుండి మొద‌టి స్థానంలో ఉంది.

3) ఈజిప్ట్ అధ్య‌క్షుడు – అబ్దుల్ ఫ‌తాహ్ ఇల్ -సిసి

4) త‌మిళ‌నాడు, ఆ స్కీమ్ పేరు -ప‌దుమ‌న్ పెన్న్.

5) ఉత్త‌ర‌ప్ర‌దేశ్

6) మ‌ధ్య‌ప్ర‌దేశ్

7) మురికివాడ‌ల్లో నివసించే వారికి సాధికారిత‌ను అందించేందుకు

8) 2027

9) జూపీట‌ర్ – 92 ఉప గ్ర‌హాలు, శ‌ని 83.

10) ముంబై ఇండియ‌న్స్ ,డిల్లీ క్యాపిట‌ల్స్ ను ఓడించింది

పెళ్లికి ముందు ట‌్రాఫిక్ సిగ్న‌ల్ ద‌గ్గ‌ర నీతాతో ముఖేష్ అంబానీ చేసిన చిలిపి ప‌ని… మొండిప‌ట్టు!

ముఖేష్ అంబానీ బిజినెస్ టైకూన్….ప‌క్కా ప్లానింగ్, అంత‌కు మించిన‌ ఎగ్జ్యూష‌న్…..అలా ఉండ‌బ‌ట్టే నేడు రిల‌య‌న్స్ ను టాప్ ప్లేస్ లో నిల‌బెట్టాడు. అలాంటి వ్య‌క్తి …పెళ్లికి ముందు నీతాతో ట్రాఫిక్ సిగ్న‌ల్ వ‌ద్ద ఓ చిలిపి ప‌నిచేశాడట‌! మ‌నోడు చేసిన ప‌నికి కొద్దిసేపు ఆ రోడ్డంతా ట్రాఫిక్ జామ్ అయ్యింద‌ట‌!

అస‌లేమైంది…
నీతా డాన్స్ చూసి….ముఖేష్ అంబానీ తండ్రి అయిన ధీరూభాయ్ అంబానీ ఆ అమ్మాయినే త‌న ఇంటి కోడ‌లిగా చేసుకోవాల‌ని ఫిక్స్ అయ్యి….త‌న ఇంటికి పిలిపించార‌ట‌…మాట ముచ్చ‌ట అయ్యాయి…కానీ సంబంధం ఇంకా ఫిక్స్ అవ్వ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఒక‌రినొక‌రు అర్థం చేసుకోవ‌డానికి నీతా- ముఖేష్ లు డేటింగ్ లో ఉన్నార‌ట‌.!

ఒక‌రోజు ఇద్ద‌రూ కార్ లో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో…..
ఒక్క‌సారిగా నీతాకు ప్ర‌పోజ్ చేశాడ‌ట ముఖేష్…నీతా ఇంకా ఆన్స‌ర్ ఇవ్వ‌లేద‌ట‌.! అప్పుడే గ్రీన్ సిగ్న‌ల్ ప‌డింది….అయినా కార్ ముందుకు న‌డ‌ప‌కుండా అక్క‌డే ఆపేశాడు…వెనుక నుండి హార‌న్స్…అయినా కార్ క‌ద‌ల్లేదు..నువ్వు ఏ సంగతీ చెప్పేవరకు కారు కదిల్చేది లేదు అని మొండిప‌ట్టు ప‌ట్టాడ‌ట‌…నీతా య‌స్ చెప్పింద‌ట‌…కార్ ముందుకు క‌దిలింద‌ట‌.. మార్చి 8 ,1985 లో వాళ్ల పెళ్లైంది!

 

సికింద్రాబాద్ -తిరుప‌తి వందేభార‌త్ రైలు….న‌ల్గొండ, గుటూరుల మీదుగా…..

సికింద్రాబాద్ నుండి 2వ వందేభార‌త్ రైలుకు ముహూర్తం ఖ‌రారైంది. ఏప్రిల్ 8న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించ‌నున్నారు. ఈ ట్రైన్ సికింద్రాబాద్ – నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరుల మీదుగా తిరుప‌తికి చేరుకుంటుంది. ప్ర‌స్తుతం 12 గంట‌లు ప‌డుతున్న జ‌ర్నీ వందేభార‌త్ కార‌ణంగా 9గంట‌ల‌కు త‌గ్గ‌నుంది.
తిరుప‌తికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వెళ్తారు కాబ‌ట్టి ఈనిర్ణ‌యం తీసుకున్నారు.

ప్ర‌స్తుతం సికింద్ర‌బాద్ – వైజాగ్ కు న‌డ‌ప‌బ‌డుతున్న వందేభార‌త్ సెమీ హైస్పీడ్ రైలు 100శాతం ఆక్యుపెన్సీతో న‌డుస్తోంద‌ని ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ టు తిరుప‌తి వందేభార‌త్ రైల్ కోసం ప్ర‌స్తుతం 110 కి.మీ గా ఉన్న బీబీన‌గ‌ర్- గుంటూర్ మార్గాన్ని 130 కి.మీ గా అప్ గ్రేడ్ చేయాల్సి ఉంటుంది.

రోహిత్ శ‌ర్మ త‌ప్పిదాల వ‌ల్లే సూర్య 3 సార్లు గోల్డెన్ డ‌క్ అయ్యాడు : పాక్ ప్లేయ‌ర్!?

రోహిత్ శ‌ర్మ త‌ప్పిదాల వ‌ల్లే సూర్య 3 సార్లు గోల్డెన్ డ‌క్ అయ్యాడని పాకిస్తాన్ ఆట‌గాడు డానిష్ క‌నేరియా అభిప్రాయ‌ప‌డ్డాడు. అస్ట్రేలియా తో జ‌రిగిన బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ టోర్నీలో సూర్య వ‌రుస‌గా మూడు మ్యాచ్ లో గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు. మొద‌టి రెండు మ్యాచ్ లు మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో LBW అయిన సూర్య‌, డిసైడ‌ర్ మ్యాచ్ లో జ‌స్టిన్ అగ‌ర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇది టీమ్ ఇండియా సీరిస్ ఓటమిపై తీవ్ర ప్ర‌భావం చూపింది. సూర్య ఫామ్ లో లేక ఇబ్బంది ప‌డుతున్న సంద‌ర్భంలో రోహిత్ కెప్టెన్ గా సూర్య‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల్సింది పోయి.. మూడవ మ్యాచ్ లో అత‌డిని 7వ బ్యాట్స్ మెన్ గా దించాడు. అస‌లే ఆత్మ‌విశ్వాసం కోల్పోయి కాస్త ఇబ్బందిగా ఉన్న సూర్య‌ను రోహిత్ నిర్ణ‌యం మ‌రింతగా కాన్ఫిడెన్స్ ను కోల్పోయేలా చేసింది.

 

కోహ్లీకూడా ఫామ్ కోల్పోయిన‌ప్పుడు టీమ్ అంతా అత‌నికి స‌పోర్ట్ గా ఉన్నారు. అనేక అవ‌కాశాలు ఇచ్చారు. కానీ అత‌ని బ్యాటింగ్ ఆర్డ‌ర్ ను మాత్రం మార్చ‌లేదు. సూర్య విష‌యంలో కూడా అదే చేసి ఉండాల్సింద‌ని డానిష్ క‌నేరియా అన్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ ప్ర‌స్తుతం నెం.1 స్థానంలో ఉన్నాడు. వన్డేలో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు 433 పరుగులు మాత్రమే చేశాడు.

ఒకే హీరో న‌టించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయిన 6 సందర్భాలు..ఆ సినిమాలు!

ఓ సినిమా రిలీజ్ చేయాలంటే…. అన్ని ర‌కాల కాలిక్యులేష‌న్స్ వేస్తారు. ఇత‌ర సినిమాలేమైనా ఉన్నాయా? రిలీజింగ్ కి ఇది క‌రెక్ట్ టైమేనా? అని బ‌ట్ అలా కాకుండా ఒకే హీరోకు చెందిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజైతే…? అదే జ‌రిగింది మ‌న టాలీవుడ్ లో., NTR ఈ విధానానికి నాంది ప‌లికాడు. అప్ప‌ట్లో సినిమాలు చాలా త‌క్కువ‌గా రిలీజ్ అయ్యేవి కాబ‌ట్టి ఒకే రోజు ఒకే హీరోకు చెందిన రెండు సినిమాల‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు సీన్ మారింది. ఇద్ద‌రు పెద్ద హీరోల సినిమాలు సైతం ఒకే రోజు విడుద‌ల చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు..కార‌ణం ఒపెనింగ్ క‌లెక్ష‌న్స్ !

6 సంద‌ర్భాల‌లో ….ఒకే హీరో న‌టించిన సినిమాలు ఒకే రోజు విడుద‌ల‌య్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

heros

1. NTR

ఫస్ట్  టైం  ఒకే రోజు  రెండు  సినిమాలు  రిలీజ్ చేసి రికార్డ్  సృష్టించిన  హీరో  NTR .  1959  జనవరి14 న  అప్పుచేసి పప్పు కూడు ,  సంపూర్ణ రామాయణం ఈ  రెండు  సినిమాలు  రిలీజయ్యాయి. రెండో సారి  కూడా  మళ్లీ  ఈ ఫీట్ NTR  సాధించారు… 1961  మే 5 న  పెండ్లి పిలుపు ,  సతీసులోచన విడుద‌ల‌య్యాయి.

 

2. శోభన్ బాబు

శోభ‌న్ బాబు న‌టించిన  లక్ష్మీ విలాసం , పంతాలు పట్టింపులు ఒకే రోజున‌( 1968  జులై 19)  విడుదలయ్యాయి.

shoban babu

3. చిరంజీవి

1980 లో  మెగాస్టార్  చిరంజీవి  నటించిన కాళి ,  తాతయ్య ప్రేమలీలలు ఈ రెండు   మూవీస్  సెప్టెంబర్ 19 న  రిలీజయ్యాయి .  వీటిలో  కాళి  సినిమాలో రజినీకాంత్  మెయిన్  హీరో. 1982  అక్టోబర్ 01 న మాత్రం చిరంజీవి హీరోగా న‌టించిన పట్నం వచ్చిన పతివ్రతలు , టింగు రంగడు  రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

 

4. క్రిష్ణ

సూపర్ స్టార్  క్రిష్ణ హీరోగా  నటించిన  యుద్ధం , ఇద్దరు దొంగలు  మూవీస్  జనవరి 14  1984 లో  ఒకే రోజు రిలీజయ్యాయి.

krishna

5. బాలక్రిష్ణ

బాల క్రిష్ణ బంగారు బుల్లోడు ,  నిప్పు రవ్వ   మూవీస్  రెండు  ఒకే  రోజు  (1993  సెప్టెంబర్ 03 ) న రిలీజయ్యాయి.

 

6. నాని

ఇక చివరిసారిగా  2015 లో  నాని రెండు  మూవీస్  ఒకే రోజు  రిలీజయ్యాయి .  మార్చ్ 21న‌  ఎవడే సుబ్రహ్మణ్యం , జెండాపై కపిరాజు సినిమాలతో  ఈ ఘనత  సాధించాడు  నాని.

 

nani

చ‌రిత్ర‌లో మొద‌టిసారిగా వాడిన వ‌స్తువులు ఇవే.! ఆ ఐడియాకే దండం పెట్టాలి!!

ఒక వ‌స్తువు పూర్తిస్థాయిగా రూపాంత‌రం చెంద‌డానికి…. అంత‌కు ముందు అది అనేక ద‌శ‌ల‌ను దాటాల్సి ఉంటుంది! అలా మొద‌టిసారిగా ఆ వ‌స్తువులు వాడిన సంద‌ర్భాలేంటో ఇప్పుడు చూద్దాం!

మొద‌టి సారిగా వాడిన బ్రా!
లెనిన్ తో త‌యారు చేసిన మొద‌టి బ్రా ఇది! మ‌ద్య యుగంలో ఆస్ట్రేలియాలో దీనిని వాడ‌డం జ‌రిగింది!

ఫ‌స్ట్ ప‌ర్ ఫ్యూమ్.
క్రీ.పూ 3000 సంవ‌త్స‌రాల క్రితం ఈజిప్ట్ లో వాడారు. దీనిని మ‌ల్లెపువ్వు, దాల్చిన చెక్క‌ల‌ను క‌లిపి త‌యారుచేసేవార‌ట‌!

మొద‌టి దువ్వెన.

‌క్రీ.పూ 1500 సంవ‌త్స‌రాల క్రితం ఈజిప్ట్ లో వాడారు. చెక్క‌తో, చేప బొక్క‌తో త‌యారు చేసేవార‌ట‌!

అభ‌ర‌ణాలు 
జంతువుల బొక్క‌ల‌తో నెథ‌ర్లాండ్ లో మొద‌ట‌గా వీటిని త‌యారు చేశార‌ట‌!

మొద‌టి కండోమ్:

జంతువుల పేగుల‌తో సుఖ వ్యాధులు రాకుండా 16,17 వ శ‌తాబ్దంలో ఇంగ్లాడ్ , స్వీడ‌న్ లో వాడార‌ట‌!

బ్ర‌ష్
క్రీ.పూ 1400 సంవ‌త్స‌రంలో…చైనాలో త‌యారు చేయ‌బ‌డింది. వెదురు బొంగుకు, పంది ఈక‌ల‌ను క‌ట్టి…ప‌ళ్లు తోముకోడానికి వాడేవార‌ట‌!

లిప్ స్టిక్:
సుమేరియ‌న్ నాగ‌రిక‌త‌లో లిప్ స్టిక్ లు ఉండేవ‌ట‌…. ప్ర‌త్యేక స‌మ‌యాల్లో ఆడ‌,మ‌గ‌లు ఇద్ద‌రూ వాడేవార‌ట‌!

బ‌రువు త‌గ్గ‌డం నిజంగా అంత క‌ష్ట‌మా? అయితే వీళ్లు ఎలా త‌గ్గారో చూడండి!

నిజంగా బ‌రువు త‌గ్గ‌డం అంత క‌ష్ట‌మా? లేదు , కాదు…మ‌న‌లో ఆ ఫైర్ ఉంటే అల‌వోక‌గా త‌గ్గేస్తాం.! దానికి కావ‌ల్సింది బ్యాలెన్స్డ్ డైట్., డెయిలీ ఎక్సెర్సైజ్స్ ., అన్నింటికి మంచి బ‌రువు త‌గ్గాల‌నే క‌సి.!

ఈ సినిమా వాళ్లను చూడండి… ఎంత ఎంత బ‌రువు త‌గ్గారో.! ( వాళ్ల‌కు అవ‌స‌రం కాబ‌ట్టి దాని మీద దృష్టి పెట్టి త‌మ కెరీర్ ను బిల్డ్ చేసుకున్నారు)

భూమి పండేక‌ర్ : 

బాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా త‌న కెరీర్ ను స్టార్ట్ చేసిన భూమి 6 నెల‌ల్లో 28 కేజీల బ‌రువు త‌గ్గి., హీరోయిన్ గా అవ‌కాశం కొట్టేసింది!

bhumi

అలియా భ‌ట్ :

3 నెల‌ల్లో 17 కేజీల బ‌రువు త‌గ్గింది. త‌న తండ్రి మ‌హేష్ భ‌ట్ గైడెన్స్ ఇస్తూ వెయిట్ లాస్ చేయించాడు.

alia bhat

 

అద్నాన్ స‌మీ :

భ‌ర్దే జోలీ అంటూ మ‌నంద‌ర్ని త‌న స్వ‌ర మాధుర్యంలో ముంచిన సింగ‌ర్.. భారీ ఆకారంలో ఉండే స‌మీ రాక్ స్టార్ గా మారాడు. మొద‌ట 230 కేజీల నుండి 130 కేజీలకు త‌ర్వాత 130 నుండి 74 కేజీల‌కు బ‌రువు దిగాడు.

అర్జున్ క‌పూర్:
తొలి సినిమాకు సైన్ చేసిన‌ప్పుడు 130 కేజీలున్న అర్జున్ 3 సంవ‌త్స‌రాల్లో 50 కేజీలు త‌గ్గి  సిక్స్ పాక్స్ తో ద‌ర్శ‌న‌మిచ్చాడు

arjun kapoor

 

క‌రీనా క‌పూర్:

ప్రెగెన్సీ స‌మ‌యంలో 90 కేజీల వ‌ర‌కు పెరిగిన క‌రీన‌…త‌ర్వాత స్ట్రిక్ట్ డైట్ మెయింటేన్ చేస్తూ 30 కేజీలు త‌గ్గారు.

kareena kapoor

 

సారా: 50+ Kgs 

sara alikhan

 

సోనం : 30+ kgs 

sonam kapoor

 

సోనాక్షి సిన్హా: 40+ Kgs

sonakshi sinha

స‌న్ ఫ్ల‌వ‌ర్స్…..స‌న్ ఎటు వైపు ఉంటే అటే ఎందుకు వంగి ఉంటాయి? 1) గ్రీకు క‌థ 2 ) సైంటిఫిక్ రీజ‌న్

పొద్దు తిరుగుడు పువ్వులు ( స‌న్ ఫ్ల‌వ‌ర్స్ ) …..సూర్యుడు ఎటువైపు ఉంటే అటు వైపు వంగి ఉంటాయి.! మీరు గ‌మ‌నించే ఉంటారు? ఎందుకిలా..? అంటే దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజ‌న్ ఉంది.! దానితో పాటు ప్రాచీన గ్రీకు క‌థ కూడా ఉంది. మొద‌ట క‌థ గురించి తెలుసుకొని త‌ర్వాత సైంటిఫిక్ రీజ‌న్ గురించి తెలుసుకుందాం.!

గ్రీకు కథ అధారంగా : 
సూర్యుడిని గ్రీకులు ‘అపోలో’ అని పిలుస్తారు.ఆ సూర్యుడిని కైట్లీ అనే వనదేవత ప్రేమించిందట. కానీ కైట్లీ ల‌వ్ ను సూర్యుడు రిజెక్ట్ చేస్తాడ‌ట‌.! ఎందుకంటే ఆయ‌న అంత‌కు ముందే జ‌ల‌దేవుని కుమార్తె అయిన డ‌ఫ్నేను ప్రేమిస్తాడ‌ట‌..! అయినా సూర్యుడిపై ప్రేమ చావ‌ని కైట్లీ సూర్యుడి కోసం 9 రోజులపాటు అన్న పానీయాలు మానేసి అక్కడే ఉంటూ సూర్యుడు వచ్చి వెళ్ళేంతవరకూ చూస్తూ ఉండేదట.! అలా కైట్లీ త‌ను ప్రేమించిన సూర్యుడిని చూసే పువ్వు ( స‌న్ ఫ్ల‌వ‌ర్ ) గా మారింద‌నేది గ్రీకు క‌థ‌.!

sun flower

సైన్స్ పరంగా : 

  • పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడు వైపు తిరగడానికి ప్ర‌ధాన‌ కారణం ఫోటోట్రోపిజం ( సూర్య ర‌శ్మికి ప్ర‌తిస్పందించే చ‌ర్య‌) అనే ప్ర‌క్రియ‌!
  • సన్ ఫ్లవర్ మొక్కలో ఉండే అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు విచ్చిన్నం అయి ఆక్సిన్ అనే హార్మోన్ ఏర్పడుతుంది. ఇది మొక్క పెరుగుదలకు సహాయపడుతుంది.
  • సూర్యరశ్మి పడనిభాగంలో ఆక్సిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో ఆ ప్రాంతంలో కాండం పెరుగుతుంది…దీంతో ముందు ఉన్న పువ్వు సూర్యుడి వైపుకు వంగుతుంది. ఇదే దీని వెనుకున్న అస‌లు లాజిక్

ఆవు పేడ‌తో నెల‌కు 10,000/- సంపాదించి పెట్టే యంత్రం.! రైతుల కోసం ప్ర‌త్యేకం!!

ఏదైనా యంత్రాన్ని తయారు చేయాలంటే.. ఇంజినీరింగే చదవాలా ఏంటీ.. ప్రతిభ ఉంటే చాలు.. ఎవరైనా ఏ అద్భుతమైనా చేయవచ్చు.. ఉత్తరప్రదేశ్‌లోని మవానాకు చెందిన 67 ఏళ్ల వ్యాపారవేత్త సుఖ్‌దేవ్‌ సింగ్‌ కూడా సరిగ్గా ఇదే చెబుతారు. అందువల్లే ఆయన ఆవుపేడతో కలప తయారు చేసే ఓ అద్భుతమైన యంత్రాన్ని ఆవిష్కరించారు.

మీరట్‌లో నాకు వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేసే ఫ్యాక్టరీ ఒకటుంది. ఇదే రంగంలో కొత్తగా ఏదైనా ఆవిష్కరణ చేయాలని అనుకునేవాడిని. 2 ఏళ్ల కిందట యూట్యూబ్‌లో ఓ వీడియో చూశా. ఆవు పేడతో దృఢమైన కలప దుంగలను తయారు చేయడం చూసి ఆశ్చర్యపోయా. వెంటనే నేనూ అలాంటి దుంగలను తయారు చేసే మెషిన్‌ను రూపొందించాలని అనుకున్నా. ఆ క్రమంలో ఇంటర్నెట్‌ సహాయంతో ఎట్టకేలకు సదరు యంత్రాన్ని రూపొందించా.. అని సింగ్‌ చెప్పారు.

సింగ్‌ తయారు చేసిన ఆ యంత్రంలో మొదట్లో గేర్‌ బాక్స్‌ ఉండేది కాదు. కానీ తరువాత ఆయన దానికి మార్పులు చేసి 5 హెచ్‌పీ ఎలక్ట్రిక్‌ మోటార్‌, గేర్‌బాక్స్‌తో ఆవు పేడను కలప దుంగలుగా మార్చే యంత్రాన్ని పూర్తి స్థాయిలో రూపొందించారు.

ఆవుపేడతో కలప దుంగలను తయారు చేయడం సులభమే. ముందుగా ఎండలో 5 రోజుల పాటు ఆవుపేడను ఎండబెట్టాలి. దీంతో అందులో ఉండే నీరు పూర్తిగా ఆవిరవుతుంది. అనంతరం ఆ పేడ ఎండిపోయి మట్టిలాగా మారుతుంది. దాన్ని సదరు యంత్రంలో ఇన్‌లెట్‌లో పోయాలి. మనకు అవసరం అయిన సైజు మేర దుంగలు వచ్చేలా యంత్రాన్ని సెట్‌ చేసుకోవాలి. దీంతో మెషిన్‌ ఆన్‌చేసి ఎండిన ఆవుపేడను అందులో పోస్తున్నకొద్దీ లోపల అది నీటితో మిక్స్‌ అయ్యి ముందుగా మనం సెట్‌ చేసుకున్న సైజులో కలప దుంగలా నిలువుగా స్థూపాకారంలోకి మారి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన దుంగలను మళ్లీ ఎండలో ఎండబెట్టాలి. దీంతో వాటిలో ఉండే వాసన, నీరు పోయి అవి దృఢమైన కలప దుంగల్లా మారుతాయి.

ఈ మెషిన్‌ సహాయంతో 3 అడుగుల పొడవు ఉండే దుంగలను తయారు చేయవచ్చు. ఒక నిమిషానికి ఒక దుంగ బయటకు వస్తుంది. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ విధానంలో వీటిని తయారు చేయవచ్చు. ఇలా తయారయ్యే దుంగలను వంట చెరకుగా ఉపయోగించుకోవచ్చు. పట్టణాల్లో కాదు గానీ.. పల్లెల్లో చాలా మంది ఇప్పటికీ కట్టెలపొయ్యిలను వాడుతారు. అలాంటి వారు వీటిని ఉపయోగించి పర్యావరణానికి మేలు చేయవచ్చు. ఎండిన కట్టెలలాగే ఈ ఆవుపేడ దుంగలు చాలా బాగా మండుతాయి. అలాగే ఇవి పెద్దవైన రంధ్రాలను కలిగి ఉంటాయి కనుక గాలి బాగా ఆడుతుంది. సులభంగా మండుతాయి.

ఇక ఈ యంత్రం ఖరీదు జీఎస్‌టీతో కలిపి రూ.80వేలు ఉండగా.. దీన్ని ఇప్పటికే పలువురు రైతులు ఉపయోగించి దీంతో నెల నెలా కొంత మేర ఆదాయం కూడా పొందుతున్నారు. నెలకు 40 కేజీల పేడ ఉత్పత్తి చేసే రైతులు దాన్ని వృథా చేయకుండా ఈ యంత్రాన్ని కొనుగోలు చేసి ఆవు పేడ దుంగలను తయారు చేసి అమ్మితే నెలకు రూ.8,400 వరకు సంపాదించవచ్చు. ఈ క్రమంలో కొద్ది నెలల్లో యంత్రానికి పెట్టిన ఖర్చు కూడా తీరిపోతుంది. తరువాత వచ్చేదంతా లాభమే. ఇలా ఈ యంత్రంతో రైతులు ఎంతగానో లబ్ధి పొందవచ్చు. నెల నెలా తమకు పశువుల పోషణతోపాటు వచ్చే ఆదాయంతోపాటు దీని ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ఇక గ్రామీణ ప్రాంతాలే కాదు, పట్టణాలు, నగరాల్లో శ్మశానవాటికల్లో, పరిశ్రమల్లో బాయిలర్లలో, ఇతర ప్రదేశాల్లోనూ ఈ ఆవుపేడ దుంగలను మంట కోసం ఉపయోగించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఆవులు, గేదెలను పెంచే రైతులు ఈ యంత్రంతో నెల నెలా ఆదాయం సంపాదించవచ్చు. దీంతోపాటు పర్యావరణాన్ని రక్షించిన వారవుతారు.

Next Page »