Advertisement
కరోనా వచ్చిన వారికి శ్వాస సమస్యలు ఎదురవుతాయన్న సంగతి తెలిసిందే. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ చేరడం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఈ దశలో హాస్పిటల్‌లో చేరకపోతే ప్రాణాలు పోయేందుకు అవకాశం ఉంటుంది. కనుక కరోనా వచ్చిన వారు శ్వాస తీసుకోవడం కష్టమైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కరోనా వచ్చిన వారే కాదు, ఇతర శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు కూడా ఆయుర్వేదంలో సూచించిన ఓ అద్భుతమైన చిట్కాను పాటిస్తే ఆయా సమస్యల నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. శ్వాస కూడా సరిగ్గా ఆడుతుంది.
ప్రతి ఇంటిలోనూ కర్పూరం, వాము ఉంటాయన్న సంగతి తెలుసు కదా. అయితే రెండింటినీ కలిపి మిశ్రమంగా చేసి ఒక చిన్న శుభ్రమైన వస్త్రంలో ఆ మిశ్రమాన్ని ఉంచి అనంతరం ఆ వస్త్రాన్ని చిన్న మూటలా కట్టాలి. తరువాత ఆ వస్త్రాన్ని ముక్కు వద్ద పెట్టుకుని గాలి పీల్చాలి. దీని వల్ల శ్వాస సమస్యల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
Advertisement
పైన తెలిపిన విధంగా కర్పూరం, వాము మిశ్రమాన్ని సాధారణంగా బద్రీనాథ్ లేదా కేదార్‌నాథ్ వంటి ప్రదేశాలకు వెళ్లే.. 80 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ఆయా ఆలయాలు ఎత్తులో ఉంటాయి. కనుక కొందరికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అలాంటప్పుడు వారు ఆ మిశ్రమాన్ని వస్త్రం ద్వారా పీలుస్తారు. దీంతో తక్షణమే శ్వాస సమస్యల నుంచి ఉపమశనం లభిస్తుంది. శ్వాస బాగా లభిస్తుంది.
Advertisements
Advertisements
అయితే అదే మిశ్రమాన్ని కరోనా వచ్చిన వారితోపాటు ఇతర శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు కూడా పీలుస్తుంటే ఫలితం ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు. కనుక దీన్ని ట్రై చేసి చూడండి. శ్వాస సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.