Advertisement
మనల్ని ఇతరులు చూసే చూపులను కూడా ఓ కంట కనిపెడుతుండాలి.. ఏదైనా తేడాగా అనిపిస్తే ముందుగానే జాగ్రత్త పడాలి లేదంటే ….జీవితమే నాశనం అవుతుంది! ధైర్యంగా ఎదుర్కోలేకపోతే ఆత్మహత్యేశరణ్యమవుతుంది! నా ఫ్రెండ్ కు అదే జరిగింది….బాధను దాచుకోలేక చెప్పుకోలేక తల్లడిల్లిపోయింది.
అసలేం జరిగిందంటే…….?
నేను నా ఫ్రెండ్ బ్యాంక్ ఎగ్జామ్స్ కొరకు ఓ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయ్యాం! అక్కడ గేట్ దగ్గర ఓ సెక్యూరిటీ గార్డు మావైపే ఎప్పుడూ చూసేవాడు. అలాగే ఇనిస్టిట్యూట్ కి వచ్చి వెళ్లే ఇతర అమ్మాయిలను కూడా అతను కన్నార్పకుండా చూసేవాడు. అతని చూపులు తేడాగా ఉన్నాయని మొదట్లోనే మేము అనుకున్నాం! అయినా ఎందుకో లైట్ గా తీసుకున్నాం!
Advertisement
ఉన్నట్టుండి….నా ఫ్రెండ్ సైలెంట్ గా , మూడీగా , తనలో తాను భయంగా ఉండడాన్ని నేను గమనించాను? ఏం జరిగిందో తను చెప్పట్లేదు….సడెన్ గా మా సెక్యూరిటీ గార్డ్ కూడా కనిపించడం లేదు! ఎందుకని ఆరా తీస్తే తెలిసింది.. అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారని.! ఈ రెండు సంఘటనలకు ఎక్కడో లింక్ ఉందని అనిపించింది….. మా ఫ్రెండ్ ను గట్టిగా అడిగాను…ఏంటి విషయమని….?
Advertisements
అసలు ఆ రోజు ఎం జరిగిందో….తను నాకు చెప్పింది.. ఓ రోజు సాయంత్రం ఆమె ఇనిస్టిట్యూట్‌లో వాష్ రూంకు వెళ్లి వస్తున్న సమయంలో ఎవ్వరూ లేనిది చూసి సెక్యూరిటీ గార్డ్ ఆమెను బలవంతం చేయబోయాడు….అతికష్టం మీద అతడి నుండి తప్పించుకొని రాగలిగిందట! ఈ విషయం బయటికి వస్తే ఎక్కడ తన పరువు పోతుందోనని రెండు మూడు రోజులు భయంభయంగా గడిపింది…కానీ సడెన్ గా ఓ రోజు ధైర్యం తెచ్చుకొని ఇనిస్టిట్యూట్ యాజమాన్యంతో జరిగిన విషయం చెప్పిందట…. మరుసటి రోజే అతడిని ఉద్యోగం నుండి తీసేశారు. !
Advertisements
ఎప్పటి వరకైతే మనం ధైర్యంగా అడుగు ముందుకేయమో….అప్పటి వరకు తప్పు చేసిన వాడు స్వేచ్చగా తిరుగుతుంటాడు…బాధితులు మరింత బాధకు లోనవుతారు…అందుకే అన్యాయాన్ని సహించకండి… ధైర్యంతో అడుగుముందుకేయండి! మన చుట్టూ పరిసరాల్ని ముందుగానే గమనించి మసలుకొండి!