Advertisement
జట్కాలు, రిక్షాలతోనే ప్రయాణాలు వెళ్లదీస్తున్న సామాన్య భారతీయులకు ఆటోలను పరిచయం చేసింది బజాబ్ కంపెనీ…. అప్పటి వరకు కొన్ని కంపెనీలు ఉన్నప్పటికీ వాటి నుండి వచ్చిన వాహనాలు ధర ఎక్కువగ ఉండేది…1961 లో బజాబ్ తన తొలి ఆటోరిక్షాను విడుదల చేసింది. మొదటి ఆరు సంవత్సరాలలో పది లక్షల ఆటోలు సేల్ అయిపోయాయి!
చేతక్
ఇప్పుడంటే ప్రతి ఇంటికి ఓ బైక్ కామన్ అయ్యింది! కానీ 1960 ప్రాంతంలో బండి రోడ్డు మీద వెళ్తుంటే …అందరూ ఆగి అలా చూసేవారు.బజాజ్ కంపెనీ ఆ వైపుగా ఆలోచించి 1972 లో చేతక్ ను విడుదల చేసింది. టూ వీలర్ అమ్మకాల్లో చేతక్ ఓ ట్రెండ్ సెట్టర్ ….ఏడాదిలోనే లక్షకు పైగా చేతక్ లు అమ్ముడుపోయాయట! 2005 లో చేతక్ ల ఉత్పత్తిని ఆపేశారు!
KB 100:
Advertisements
యమహా RX100, SUZUKI AX 100 అంటూ జనాల్లో బైక్ ల పట్ల ఆసక్తి పెంచుతున్న క్రమంలో తను వెనుక పడొద్దని బజాన్ కవాసకితో జాయిన్ అయ్యి 1986లో KB ( కవాజకి బజాజ్ )100 ను తీసుకొచ్చింది. వీటి సేల్స్ కూడా విపరీతంగా ఉండడంతో 1996 లో ఈ మోడల్ కు కొన్ని మార్పులు చేసి KB 100 స్థానంలో Boxer ను విడుదల చేశారు…స్కూటర్ల కొనుగోళ్లు తగ్గి బైక్ ల కొనుగోళ్లు పెంచిన బ్రాండ్ ఇది!
Advertisement
4S ఛాంపియన్
హీరోహోండ, TVSలు మార్కెట్లో తమ బ్రాండ్స్ ను గట్టిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న తరుణంలో 4S ఛాంపియన్ అంటూ 4 స్ట్రోక్ మోటార్ సైకిల్ ను ఇండియన్ మార్కెట్ లో మొట్ట మొదటి సారిగా విడుదల చేసింది బజాజ్ కంపెనీ! 1995 ఒక్క ఏడాదిలోనే లక్ష బైక్ లను అమ్మేసింది!
పల్సర్
యూత్ ను టార్గెట్ చేస్తూ హీరో హోండా CBZ రిలీజ్ చేసింది! దీనికి మంచి స్పందన రావడంతో….. వెంటనే బజాజ్ పల్సర్ పేరుతో మరో బైక్ ను విడుదల చేసింది! 2001 విడుదలైన ఏడాదే లక్ష బండ్లు అమ్ముడుపోయాయి!
ప్లాటినా
2008 తర్వాత ఇండియన్ మార్కెట్ లో ….బజాజ్ కు కష్టాలు ఎదురయ్యాయి.! మిగితా కంపెనీ బైక్ లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న తరుణంలో బజాజ్ కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో రెండు మూడు మోడల్స్ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాయి! దీంతో 109 కిలోమీటర్ల మైలేజ్ ను పరిచయం చేస్తూ బజాజ్ ప్లాటినా ను విడుదల చేశారు! ఈ బండ్లకు గ్రామాలల్లో విపరీతమైన డిమాండ్ ఉండేది!
Advertisements
తర్వాత స్పోర్ట్స్ బైక్స్ వైపుగా దృష్టి సారించింనప్పటికీ అక్కడ అంతగా క్లిక్ అవ్వలేదు!