Advertisement
మన అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటేనే పండుగ అలాంటిది… ఒకే రోజు అదే హీరోకు చెందిన రెండు సినిమాలు రిలీజైతే ఇంకో లడ్డు కావాలా నాయనా? అన్నట్టే! రిలీజైన రెండు సినిమాలు కూడా హిట్టైతే…? అదే జరిగింది బాలయ్య బాబుకు….! ఒకే రోజు ఒకే హీరోకు చెందిన రెండు సినిమాలు రిలీజ్ అవ్వడంలో మొదట NTR ఉంటే….. రెండవతరం హీరోల్లో మొదటి వాడు బాలయ్యబాబు కావడం విశేషం!
1993 సెప్టెంబర్ 3
బాలయ్య నటించిన రెండు సినిమాలు నిప్పు రవ్వ , బంగారు బుల్లోడు 1993 సెప్టెంబర్ 3 ( ఒకే రోజు) విడుదలయ్యాయి.. నిప్పురవ్వ హిట్ , బంగారు బుల్లోడు సూపర్ హిట్ సినిమాలు గా నిలిచింది. ఒకే హీరోకు చెందిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల చేయాలంటే గట్స్ కావాలి…పైగా అందులో నిప్పురవ్వ సినిమాకు బాలయ్యే నిర్మాత! సినిమాల మీద నమ్మకంతో డేర్ చేశారు…సక్సెస్ కొట్టారు!
నిప్పురవ్వ
యువరత్న ఆర్ట్స్ పతాకంపై ఏ.కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా నిప్పురవ్వ … ఈ మూవీలో బాలయ్య సరసన విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. సింగరేణి బొగ్గుగని కార్మికుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది.
4గురు మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతమందించిన సినిమా!
Advertisements
Advertisement
ఈ సినిమాకి బప్పీ లహరి సంగీతం అందించగా, రాజ్ – కోటి ‘రండి కదిలి రండి’ పాటకు సంగీతాన్ని అందించారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏ.ఆర్.రహమాన్ అందించారు. అప్పటి వరకు తెలుగులో వచ్చిన సినిమాల్లోకెల్లా ఎక్కువ బడ్జెట్ సినిమా ఇదే!
బంగారు బుల్లోడు
జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై జగపతిబాబు తండ్రి వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బడ్జెట్ అప్పట్లోనే 4 కోట్లు! స్వాతిలో ముత్యమంతా అనే హిట్ సాంగ్ ఈ సినిమాలోనిదే. ఈ రెండు సినిమాలు రాజమండ్రిలో 100 రోజులు ఆడాయి.!
Advertisements
వాస్తవానికి నిప్పురవ్వ మొదట విడుదల అవ్వాలి.కానీ సినిమా షూటింగ్ క్రమంలో ఓ ప్రమాదం జరిగింది…దీంతో ఈ సినిమా విడుదలను ఆపేయాలని కోర్ట్ ను ఆశ్రయించడంతో…. కోర్ట్ క్లియరెన్స్ వచ్చేసరికి సినిమా విడుదల లేట్ అయ్యింది…సరిగ్గా అదే సమయానికి బంగారు బుల్లోడు రిలీజ్ ను పెట్టుకున్నారు. ఇతర హీరోల సినిమాలు కూడా లేకపోవడంతో రెండింటిని రిలీజ్ చేయడానికి రెండు సినిమాల ప్రొడ్యూసర్లు ఓకే అనడంతో రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి!