Advertisement
నర్తనశాల ఓ మాస్టర్ క్లాసిక్ మూవీ! అప్పటి వరకు రాముడు, కృష్ణుడిగా NTR కు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు NTR ను బృహన్నల పాత్రలో చూసి అవాక్కయ్యారు. ఈ సినిమాలో NTR అర్జునుడి పాత్రలో రౌద్రాన్ని, బృహన్నల పాత్రలో టిపికల్ బాడీ లాంగ్వేజ్ ను ప్రదర్శించి ఔరా అనిపించారు. ఈ సినిమాకు రాష్ట్రపతి అవార్డ్ లభించింది. 1963లో విడుదలైన ఈ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది.
మరి బాలకృష్ణ నర్తనశాల ఏంటి?
బాలయ్య కు సహజంగానే పౌరాణిక సినిమాలంటే ఇష్టం…అందులో తన తండ్రి చేసిన నర్తనశాల అంటే అమితమైన ఇష్టం. ఈ సినిమాను ఎలాగైనా తానే మళ్లీ డైరెక్ట్ చేసి తండ్రికి అంకితమివ్వాలని అనుకున్నాడు….అందుకే 2004 లో నర్తనశాల అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం మొదలు పెట్టాడు. అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, ధర్మరాజుగా శరత్ కుమార్, భీముడిగా శ్రీహరి ఈ సినిమాలో నటించారు. దురదృష్టవశాత్తు… ఎప్రిల్ 17, 2004 న సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించింది. దీంతో ఈ సినిమా షూటింగ్ అక్కడితో ఆగిపోయింది.
పూర్తికాని సినిమా ఇప్పుడెందుకు?
సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే బాలయ్య… తను తీసిన నర్తనశాలను కూడా ప్రజలకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఆక్టోబర్ 24 న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే తీసిన సినిమాను షార్ప్ ఎడిటింగ్ చేయించి… చెప్పాల్సిన అంశాలను చెబుతూ 17 నిమిషాల సినిమాగా ఎటీటీ ద్వారా విడుదల చేయనున్నారు.
Advertisements
మనమెందుకు చూడాలి? టికెట్ రేటెంత??
సౌందర్య కోసం చూడాలి, శ్రీహరి కోసం చూడాలి,బాలయ్య బాబు డైలాగ్స్ కోసం చూడాలి, క్లాసిక్ మూవీని బాలయ్య ఎలా డైరెక్ట్ చేశాడో తెలుసుకోడానికి చూడాలి. మరీ ముఖ్యంగా పేదలకు సహాయం కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహించేందుకు చూడాలి. మినిమం 50 రూపాయల టికెట్ ఉంది…. ఆపైన ఎంతైన పెట్టి టికెట్ కొని సినిమా చూడొచ్చు. ఇలా వచ్చిన డబ్బు బసవతారకం ట్రస్ట్ కు వెళుతుంది. అక్కడి నుండి అవసరమైన వారి సహాయార్థం వెళుతుంది.
Advertisement
జైబాలయ్య- ఆక్టోబర్ 24 డేట్ గుర్తుపెట్టుకోండి- శ్రేయాస్ ఏటీటీలో సినిమా చూడండి. సహాయంలో మీ వంతు పాత్రను పోషించండి
Advertisements