Advertisement
ఆంధ్రాలోని గోదావరి జిల్లాల్లో వెదురుబొంగులో రకరకాల బిర్యానీలు చేస్తారు. తెలుసుకదా..! మరి అవే బొంగులతో రుచికరమైన వంటకాలు చేస్తారని, ఆ వంటకాలు పలు రకాల జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తాయని తెలుసా? ఇంతకీ అలాంటి వెరైటీ వంటకాలు ఎక్కడ చేస్తారు? ఎలా చేస్తారు? అన్న విషయాలు తెలుసుకుందామా?
ఈశాన్య భారతదేశంలో..
భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలోని అస్సాం రాష్ట్రం సుందరమైన అడవిసంపదకే కాదు, వైవిధ్య రుచులకు చిరునామాగా ఉంది. ముఖ్యంగా అక్కడి కొండప్రాంతాల్లో లభించే అటవీ ప్రాంత ఉత్పత్తుల్లో వెదురు చాలా ఫేమస్. ఇక్కడ అనేక రకాల వెదురు చెట్లు పెరుగుతాయి. ఈ వెదురు చివర ఉండే లేత భాగాలను ఇక్కడి గిరిజనులు సేకరిస్తారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటితో పలు రకాల వంటలు చేసి పెడతారు.
Advertisement
ఏమేం చేస్తారంటే..
వెదురు చిగుళ్ల చివరలను చాలా జాగ్రత్తగా కత్తిరిస్తారు. తరువాత చిన్న బాగాలుగా తురుకుముతారు. తురిమిన వెదురును పులుసు చేస్తారు. దీని రుచిని స్థానికులే కాదు, దేశ విదేశాల నుంచి వచ్చే వారు కూడా చాలా ఆస్వాదిస్తారు. ఇంకా వీటిని ఉడకబెట్టి, ఫ్రై చేసి రకరకాల వెరైటీలు వండుతారు. కేవలం వెజిటేరియన్ ఫుడ్డే కాదు, వీటితో నాన్ వెజ్‌లోనూ వేసి వండితే.. అంతా లొట్టలేసుకుని తింటారు. అంతే కాదు, వెదురు బొంగుల పచ్చడ కూడా భలేగా ఉంటుందట. కేవలం అస్సాంలోనే కాదు, ఈ వంటలు పొరుగున్న కోల్‌కత్తాలోనూ బాగా ప్రాచుర్యం పొందాయి.
Advertisements
Advertisements