Advertisement
లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకూడదని బ్యాంక్ లావాదేవిల విషయంలో కొన్ని ఉపశమనాలు కల్పించింది కేంద్ర ప్రభుత్వం..ఏ బ్యాంక్ నుండైనా విత్ డ్రా చేస్కునేలా, మినిమం బ్యాలెన్స్ లేకపోయినా పెనాల్టి పడకుండా ఇలా కొన్ని సడలింపులు ఇచ్చింది.. ఇప్పుడు లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో మార్చిన బ్యాంక్ నిబంధనలను తిరిగి యాథాతదంగా కొనసాగించాలని నిర్ణయించింది..
మార్చి 24న కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన సడలింపులన్ని జూన్ 30తోనే పూర్తయిపోయాయి..జూలై 1 నుండి గతంలో మాదిరిగానే బ్యాంక్ ఛార్జిల మోత మోగనుంది.. అవేంటో తెలుసుకుని జాగ్రత్తపడండి…
Advertisement
- లాక్ డౌన్ నేపధ్యంలో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయలేదు..కానీ ఇకపై ఇంతకుముందులానే మినిమం బ్యాలెన్స్ లేకుంటే ఫైన్ కట్టి తీరాలి.
- లాక్ డౌన్ లో ATMల నుండి ఎంత డబ్బు కావాలంటే అంత విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పించారు..కానీ ఇప్పుడు ఏటీఎం నుండి మనీ తీసుకోవాలాంటే డెయిలీ కొంత లిమిట్ ఉంటుంది..అంతకు మించి డబ్బు విత్ డ్రా చేయడానికి ఇకపై కుదరదు.
- అలాగే ఎటిఎంస్ నుండి చేసే ట్రాన్సాక్షన్స్ కి కూడా లిమిట్ ఉంది. ఉదాహరణకు SBI మెట్రో నగరాల్లో 8 ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉచితం.. వాటిని మీరు 5 SBI ఏటిఎం నుండి, 3 ఇతర బ్యాంక్ ఏటిఎంలలో తీసుకోవచ్చు… నాన్-మెట్రో నగరాల్లో అయితే ఎస్బీఐ నుండి ఐదు, ఇతర బ్యాంకు నుండి ఐదు మొత్తం పది ట్రాన్సాక్షన్స్ ఉచితంగా తీసుకోవచ్చు.
- ట్రాన్సాక్షన్స్ పరిమితి దాటితే క్యాష్ ట్రాన్సాక్షన్స్ పై 20 రూ. ప్లస్ జీఎస్టీ విధిస్తుంది. నాన్-క్యాష్ ట్రాన్సాక్షన్స్ పై 8 రూపాయల ప్లస్ జీఎస్టీ ఛార్జ్ పడుతుంది.ఏటీఎం నుండి కేవలం మనీ మాత్రమే విత్ డ్రా చేయం, మినిస్టేట్మెంట్ తీస్కుంటాం, బాలన్స్ చెక్ చేస్తాం, మనీ ట్రాన్సఫర్ చేస్తాం…కాబట్టి ట్రాన్సాక్షన్స్ లిమిట్ ని దృష్టిలో ఉంచుకొని ఎటిఎం ని వాడండి.
ఫైన్స్ అన్నింటిని తప్పించుకోవాలంటే
Advertisements
- ఒకటికి మించి బ్యాంకులలో అకౌంట్స్ ఉంటే మీరు ఉపయోగించని ఖాతాల్ని క్లోజ్ చేయడం ఉత్తమం..
- ఇంటర్నెట్ బ్యాంకింగే ఉత్తమమైన మార్గం..
- అత్యవసరమైతే తప్ప ఎటిఎంస్ ని వాడకుండా ఉండడం ఉత్తమం..
Advertisements
ఈ మార్పులన్ని జూలై 1 నుండి పునరుద్దరించబడ్డాయి కాబట్టి వెంటనే జాగ్రత్తపడండి..లేకపోతే ఉన్నదంతా ఫైన్ల రూపంలో కట్ అయిపోతుంది.. పోయినసారి మినిమం బ్యాలెన్స్ లేకపోవడం వల్ల బ్యాంకులు వసూలు చేసిన ఫైన్ల విలువ కోట్లలోనే ఉంది మరి..!