Advertisement
కొరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఈ ఏడాది 10 వ తరగతి పరీక్షలను రద్దు చేసి, స్టూడెంట్స్ ను ప్రమోట్ చేశాయి. ఈ సందర్భంగా వాట్సాప్ లో ఓ తాత ఫోటో చూపుతూ… బర్కత్ అలి అనే 82 ఏళ్ల వ్యక్తి…10 పరీక్షను 47 సార్లు తప్పాడు..ఈ సారి పరీక్షలు లేకుండానే పాస్ అయ్యాడు అని సర్క్యులేట్ అవుతుంది.

వాట్సాప్ లో వస్తున్న ఫోటో
ఇంతకీ ఈ వార్త నిజమేనా…?: సగం నిజం- సగం కల్పితం.
ఈయన పేరు బర్కత్ అలి కాదు.. శివ్ చరణ్ యాదవ్ ., ఈయనది రాజస్తాన్ లోని ఖోహరి గ్రామం.! 1968 లో మొదటి సారి పదవ తరగతి పరీక్ష రాయడం మొదలు పెట్టిన శివ్ చరణ్ యాదవ్… 2016 వరకు మొత్తం 47 సార్లు పదవ తరగతి పరీక్షను రాశారు..కానీ ప్రతిసారీ ఫెయిల్ అవుతూ వచ్చారు.
Advertisement
1995వ సంవత్సరంలో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యారు కానీ మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యారు. అప్పటి నుండి ఎన్ని సార్లు రాసినా ఆ గండం మాత్రం గట్టెక్కట్లేదు.! మరో విషయం ఏంటంటే 10 పాస్ అయితేనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న శివ్ చరణ్ యాదవ్ గారికి ఇంకా పెళ్లి కాలేదు.!
Advertisements
ఇంతకీ ఈ సారి అయినా పాస్ అయ్యాడా?
లేదు., 2016 తర్వాత ఈయన పరీక్ష రాసినట్టు వార్తలు రాలేదు. ఇప్పటికీ రాజస్థాన్ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల రద్దు పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతకీ శివ్ చరణ్ బతికున్నారా? అనే సమాచారం కూడా లేదు!
Advertisements