Advertisement
బిబిసి వరల్డ్ హిస్టరీ మ్యాగజైన్ వారు వారి పత్రిక పాఠకులైన 5,000 మందితో అన్ని వేళలో ప్రపంచ గొప్పనాయకుడు ఎవరు అనే విషయంపై పోలింగ్ నిర్వహించారు .ఈ పోలింగ్ ద్వారా అధికారాన్ని వినియోగించుకొని , మానవత్వం పై సానుకూల ప్రభావాన్ని చూపిన ఉత్తమ నాయకుడిని ఎన్నుకోవాలని , మ్యాగజైన్ వారి పాఠకులను కోరింది .
ఈ పోలింగ్ లో అనేకమంది ప్రసిద్ధ చరిత్ర కారుల పేర్లని మ్యాగజైన్ వారు నామినేట్ చేశారు. పోలింగ్ పూర్తయింది ఫలితాలను చూసి బిబిసి వరల్డ్ హిస్టరీ మ్యాగజైన్ వారు ఖంగుతిన్నారు .
ఈ పోలింగ్ లో తమ పాఠకులలో 38% మంది ఎన్నుకోబడి మొదటి స్థానం పొందిన గొప్పనాయకుడు. 19 వ శతాబ్దపు భారతీయ యోధుడు,సిక్స్ సామ్రాజ్య స్థాపకుడు పంజాబ్ కి చెందిన “మహా రాజా రంజిత్ సింగ్ ” కైవశం చేసుకున్నారు . వీరి పాలన పంజాబ్ మరియు వాయువ్య భారత దేశానికి స్వర్ణయుగాన్ని సూచించింది .
Advertisement
Advertisements
బిబిసి వరల్డ్ హిస్టరీ మ్యాగజైన్ వారు నిర్వహించిన ఈ పోలింగ్ లో ” మహా రాజా రంజిత్ సింగ్’ గారు అబ్రహం లింకన్ మరియు విన్స్టన్ చర్చిల్ వంటి వారిపై ఎంపికై ఆ గౌరవాన్ని కైవసం చేసుకున్నారు .
రెండవ స్థానం ఆఫ్రికన్ స్వాతంత్ర్య సమరయోధుడు అమల్కార్ కాబ్రాల్‌కు దక్కింది, పోర్చుగీస్ ఆక్రమణ నుండి తమను తాము విడిపించుకోవడానికి ఒక మిలియన్ మంది గినియన్లను ఏకం చేసిన 7 ఆయనది. అనేక ఇతర వలసరాజ్యాల ఆఫ్రికన్ దేశాలు స్వాతంత్య్రం కోసం ఎదగడానికి మరియు పోరాడటానికి ప్రేరేపించిన ఘనత కూడా ఆయనది. అమల్కార్ కాబ్రాల్ 25 శాతం పాఠకులచే గొప్ప నాయకుడిగా ఎన్నుకోబడ్డారు.
Advertisements
బ్రిటిష్ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కు చేసిన కృషికి 7 శాతం ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ నాలుగో స్థానంలో ఎన్నికయ్యారు.