Advertisement
భారతదేశంలోని అనేక పురాతన ఆలయాల్లో శిల్పకళాసంపద ఉట్టిపడుతుంటుంది. కళాకారులు అప్పట్లోనే ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో సాధారణ పనిముట్లు, పరికరాలతో అద్భుతమైన కళఖండాలను చెక్కారు. వాటిల్లో అనేక ఆలయాల్లోని శిల్పాలు, కళాకృతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇక అలాంటి శిల్ప సంపద ఉట్టిపడే ఆలయాల్లో కర్ణాటకలోని బెలూర్‌లో ఉన్న చెన్నకేశవ ఆలయం కూడా ఒకటి.
చెన్నకేశవ ఆలయంలో గోడలపై అద్భుతమైన కళాకృతులను, శిల్పాలను మనం చూడవచ్చు. కళాకారులు అద్భుతంగా వాటిని మలిచారు. ఎక్కడ చూసినా శిల్పకళా సంపద దర్శనమిస్తుంది. చూపరులను ఆ శిల్పాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. అంత అద్భుతమైన శిల్పాలను ఎలా మలిచారా అని ఆశ్చర్యం కలుగుతుంది.
ఇక తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలోనూ శిల్ప సంపద కనువిందు చేస్తుంది. ఆలయంలో రాళ్లను చెయిన్లుగా మలిచారు. వాటిని చూస్తే ఇనుప చెయిన్లేమోనని మనకు భ్రమ కలుగుతుంది. అంత అద్భుతంగా వాటిని చెక్కారు. ఆలయంలో పలు చోట్ల అలాంటి రాతి చెయిన్లను చూడవచ్చు.
Advertisement
Advertisements
కాగా కేరళలో ఉన్న అలువలోని ఉలియన్నూర్ ఆలయంలో ఓ కొలనను వైవిధ్యభరితమైన ఆకారంలో నిర్మించారు. ఆలయ కమిటీకి చెందిన ముగ్గురు కొలనును తమకు ఇష్టమైన ఆకారంలో నిర్మించాలని అన్నారు. ఒకరు చతురస్రాకారంలో కొలను ఉండాలని అడగ్గా, ఒకరు దీర్ఘచతురస్రాకారంలో కొలను ఉండాలన్నారు. ఇంకొక వ్యక్తి వృత్తాకారంలో కొలను నిర్మించాలని అన్నాడు. అయితే ముగ్గురి కోరిక మేరకు పెరుంతచన్ అనే వ్యక్తి వైవిధ్యభరితమైన ఆకారంలో కొలను కనిపించేలా నిర్మించాడు. దాన్ని పై నుంచి చూస్తే భిన్నమైన ఆకారంలో కనిపిస్తుంది.
Advertisements
అలాగే పెరుంతచన్ ఉలియన్నూర్ ఆలయంలో 68 కాలర్ బీమ్స్‌ను కేవలం ఒకే యాన్యులర్ సపోర్ట్‌తో పైకప్పుకు నిర్మించాడు. ఇది అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.