Advertisement
నాకు అప్పుడు 18 ఏళ్లు… +2 చదువుతున్నాను.! ట్యూషన్ లో ఓ అబ్బాయి పరిచయమయ్యాడు.! అప్పుడు నా దగ్గర నోకియా 3310 ఫోన్ ఉండేది.! ఆ ఫోన్ తో ఫస్ట్ Hi., అని నేనే అతనికి మెసేజ్ చేశాను…అలా మొదలైంది మా పరిచయం.! రాత్రంతా దొంగచాటుగా ఫోన్ లో మాట్లాడేదాన్ని…. చాటింగ్ అంతా అయ్యాక …మెసేజెస్ అన్నీ డిలీట్ చేసేదాన్ని.! అతను మా ఇంటి ముందున్న గ్రౌండ్ కి క్రికెట్ ఆడడానికి వచ్చేవాడు …అ వంకతో నన్నే చూసేవాడు…నేను కూడా బాల్కానీ లోకి వచ్చి అతన్ని చూసేదాన్ని…ఆ వయస్సులో అదో మధురానుభూతి.
+2 తర్వాత….అతడు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాడు. నేను మెడిసిన్ వైపు.! అలా 4 ఏళ్లల్లో ఇద్దరం మా మా గ్రాడ్యయేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం.! ఈ గ్యాప్ లో అప్పుడప్పుడు డైరెక్ట్ గా కలిసేవాళ్లాం…అది కూడా దొంగచాటుగా.! నా ఫోన్ యే మా సమాచార వారథి.!
Advertisement
ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు… చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. ధైర్యం తెచ్చుకొని చెప్పాను…మీరు చూడాల్సిన అవసరం లేదు..నేనే ఓ అబ్బాయిని చూసుకున్నాను అతడినే చేసుకుంటానని… మొదట్లో ఇబ్బంది పడ్డా..తర్వాత మా సైడ్ వాళ్లు ఓకే అన్నారు.
అతని ఇంట్లో కులాలు వేరు అనే కారణంతో ఒప్పుకోలేదు..కానీ అతడు ఒప్పించాడు. సాంప్రదాయబద్దంగా మా పెళ్లి జరిగింది.! మా స్నేహాన్ని ప్రేమగా…. ప్రేమని పెండ్లిగా మార్చిన ఆ ఫోన్ ఇంకా నాతో అలాగే ఉంది.!
Advertisements
Advertisements
మా పెళ్లై రెండేళ్లైంది…చాలా హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నాము.! అన్ని రిలేషన్ షిప్స్ లో ప్రేమ అనేది కాస్త కఠినమైనది….నిర్ణయం తీసుకునేముందు ఆలోచించి తీసుకోండి…అందరికీ నాలాంటి భర్త దొరకకపోవొచ్చు.!