Advertisement
అల్కాహాల్ లో చాలా వెరైటీలుంటాయి. వాటిని తయారు చేసే పద్దతి, వాటిలో వినియోగించే పదార్థాలను బట్టి…వాటికి డిఫరెంట్ పేర్లుంటాయి! మనం తరచూ వినే బీర్, వైన్, బ్రాందీ, విస్కీ , స్కాచ్ లను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం!
బీర్ :
మాల్ట్ (బార్లీ, గోధుమ మొదలైనవి) బీర్ తయారీలో ఉపయోగించే ప్రధాన పదార్థం. బీర్ తయారీ ప్రక్రియను బ్రూయింగ్ అంటారు. మాల్ట్ ను పులియబెట్టి బీర్ ను తయారు చేస్తారు.
Advertisements
వైన్ :
ద్రాక్షను పులియబెట్టి వైన్ ను తయారు చేస్తారు. ఇప్పుడు కొన్ని రకాల ఇతర పండ్లనుపయోగించి కూడా వైన్ ను తయారు చేస్తున్నారు.
షాంపైన్ :
ఇది వైన్ ను మరోసారి పులియబెట్టడం ద్వారా వచ్చే రూపం. దీని తయారీలో రెండు సార్లు కిణ్వ ప్రక్రియ జరుగుతుంది. ఇది ఫ్రాన్స్‌లోని షాంపైన్ అనే జిల్లా నుండి వచ్చింది కాబట్టి దానికి అదే పేరు ఫిక్స్ అయ్యింది.
Advertisement
బ్రాందీ :
వైన్ ను మరితం శుద్ది చేయగా వచ్చే ఫలిత పానియమే బ్రాందీ.
విస్కీ :
విస్కీలో ఉపయోగించే ప్రధాన పదార్థం మాష్ ఆఫ్ ఫెర్మెంటెడ్ గ్రెయిన్ (గోధుమ, బార్లీ మొదలైనవి). ఇది ఓక్ పేటికలలో కొంతకాలం పులియబెట్టబడుతుంది.
స్కాచ్ :
ఇది కూడా విస్కీనే కాకపోతే స్కాంట్లాండ్ లో డిఫరెంట్ పద్దతిలో తయారు చేయబడింది. 3 సంవత్సరాల పాత విస్కీయే స్కాచ్!
రమ్ :
రమ్‌లో ఉపయోగించే ప్రధాన పదార్థం మొలాసిస్ (చెరకు రసం). రమ్ ఏర్పడటానికి మొలాసిస్ ను బాగా శుద్ది చేస్తారు.
Advertisements