Advertisement
ఆహార పదార్ధాల విషయంలో కొందరు అన్నీ తినే అవకాశం ఉన్నా సరే వద్దనే షో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సి ఫుడ్ విషయంలో జనాలు కాస్త ఓవర్ యాక్షన్ ఎక్కువగానే చేస్తూ ఉంటారనే మాట వాస్తవం. సి ఫుడ్ లో ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలు ఉన్నా సరే వాటిని పట్టించుకునే పరిస్థితి ఉండదు. చిన్న చిన్న చేపలు కళ్ళకు సరిగా కనపడవు కాబట్టి వాటిని తినడానికి ఇష్టపడటం లేదు.
Also Read:వర్మ సినిమాలను యూత్ ఎందుకు చూడట్లేదు…?
కాని సముద్రంలో దొరికే కొన్ని చేపలు చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందులో ప్రత్యేకంగా చెప్పుకునే చేపలు కవ్వళ్ళు. ఇవి సముద్రంలో విరివిగా దొరికే చిన్న చిన్న చేపలు. ఒక్కొక్కటి 3 నుండి 4 అంగుళాల పొడవు మాత్రమే ఉంటాయి. ఇవి ఎన్నో అధిక పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. మన ఎముకల దృఢత్వానికి దోహదపడే విటమిన్ బీ 12 & విటమిన్ డీ లు ఈ చేపల్లో పుష్కలంగా ఉంటాయని చెప్తున్నారు.
Advertisement
Advertisements
ఒమేగా 3 క్రొవ్వు తో పాటు ఖనిజ లవణాలు కూడా చాలానే ఉన్నాయి. మనదేశంలో ప్రతి తీరప్రాంతంలో ఇవి ఎక్కువగానే దొరుకుతాయి. ఈ చేపలు రుచిగా ఉన్నా సరే ముళ్ళు ఎక్కువగా ఉండటంతో చాలా మంది తినడానికి ఇష్టపడటం లేదు. అయితే వీటికి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు తీర ప్రాంతాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది.
Advertisements
Also Read:ఆ కాంగ్రెస్ ఎంపీ ఇంత టాలెంట్ ఉన్న నాయకుడా…? ఆయన ఏం చదివారు…?