Advertisement
కరోనా టైం లో ఆర్ధికంగా భర్తలు చాలా నష్టపోయారు కాబట్టి భార్యలు కూడా ఏదోక వ్యాపారం చేసి సంపాదించి కుటుంబ భారం తమ మీద కూడా వేసుకోవాలని చూస్తున్నారు. ఇక భర్తలు కోల్పోయిన వాళ్ళు కూడా తమ కాళ్ల మీద తాము నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆడవాళ్ళు తక్కువ ఖర్చులో చేసుకునే వ్యాపారాలు ఏంటీ అంటే పచ్చడి, ఇడ్లీ పిండి అని చెప్తారు గాని ఆడాళ్ళు ఏయే వ్యాపారాలు చేయవచ్చో చూడండి.
Also Read:ఈ కామర్స్ సైట్స్ కి డబ్బులు ఎలా వస్తాయి…?
ఫుడ్ ట్రక్ లాగానే ఒక ఫ్యాషన్ ట్రక్ ని డిజైన్ చేసుకుంటే మంచి లాభం ఉంటుంది అని కొందరు చెప్తున్నారు. బోటిక్ లాగానే ఫ్యాషన్ ఇండస్ట్రిని వీల్స్ మీద రన్ చేయవచ్చని సూచిస్తున్నారు. కొత్తగా వచ్చే బట్టలు, బ్లౌసులు, చీరలు, మేకప్ ఐటమ్స్ ఇలా ఒక ట్రక్ లో పెట్టి విక్రయిస్తే మంచి లాభాలు ఉంటాయట. సిటీ లోఉన్న ప్రముఖ గేటెడ్ కమ్యూనిటి, అపార్ట్మెంట్స్ లో ప్రోమోట్ చేసుకుంటే, కాంటాక్ట్ లు పెంచుకుంటే సరిపోతుంది.
Advertisement
Advertisements
బోటిక్ అద్దె కన్నా తక్కువ ఖర్చుతో నడుపుకోవడానికి అవకాశం ఉంది. ఇక బట్టలు, కాస్మమేటిక్స్ మీద 30 శాతం మార్జిన్ ఉండే అవకాశం ఉంది. ఆర్డర్ ప్రకారం కొత్త స్టాక్, డిజైన్స తెప్పించుకోవడం వాటిని ప్రమోట్ చేయడం చేయాలి. ఆడాళ్ళు చాలా వరకు వాయిదా పద్దతిలో బట్టలు కొనడానికి కొంత వరకు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి మంచి మంచి ఆఫర్ లు ఇస్తే కొనే ఛాన్స్ ఉంటుంది. బ్రాండెడ్ బట్టలు కూడా విక్రయిస్తే మంచిది అంటున్నారు.
Advertisements