Advertisement
సమాజంలో కొందరు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు. అందువల్ల వారి జీవితం సాఫీగా సాగుతుంది. ఏ ఇబ్బంది రాదు. అన్నీ టైముకు అందుతాయి. కానీ పేదరికంలో జన్మించిన వారు మాత్రం కష్టపడాలి. ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే అహోరాత్రులు శ్రమించాలి. సరిగ్గా ఈ విషయాన్ని నమ్మాడు కనుకనే అతను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాడు. పేదరికంలో పుట్టినా తన గోల్ నెరవేర్చుకునేందుకు అది ఏ మాత్రం అడ్డు కాలేదు.
చిత్రంలో ఉన్న ఐపీఎల్ అధికారి పేరు సఫిన్ హసన్. దేశంలోనే అత్యంత పిన్న వయస్సులో ఐపీఎస్ అయిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 22 ఏళ్ల వయస్సులోనే యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి అత్యుత్తమ ర్యాంకు సాధించి ఐపీఎస్ అయ్యాడు. ఆ పరీక్ష ఎంత టఫ్‌గా ఉంటుందో అందరికీ తెలుసు. అయినప్పటికీ రాత్రింబవళ్లు కష్టపడి చదివి మరీ హసన్ ఐపీఎస్ అయ్యాడు.
Advertisement
సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లు రాసేవారు చాలా మంది ఐఏఎస్ కావాలని కలలు కంటుంటారు. కానీ హసన్ మాత్రం ఐపీఎస్‌ను ఎంపిక చేసుకున్నాడు. ప్రజలకు ఐపీఎస్ అయి సేవ చేయాలన్నది అతని ఉద్దేశం. అందుకనే ఐపీఎస్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. 2018లో యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఆలిండియా లెవల్లో 570 ర్యాంకును సాధించాడు. తరువాత ఐపీఎస్ అయ్యి 2019 డిసెంబర్ 23న జామ్‌నగర్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఎట్టకేలకు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. అందుకు అతను ఎంతగానో శ్రమించాడు. కనుక హసన్‌ను హార్డ్ వర్క్‌కు ఉత్తమ ఉదాహరణ అని చెప్పవచ్చు.
Advertisements
Advertisements
హసన్ ది పేద కుటుంబం. గుజరాత్‌లోని కనోదర్ అనే గ్రామంలో నివసిస్తారు. వారికి పూట పూటకు సరిగ్గా భోజనమే దొరికేది కాదు. కొన్ని సార్లు రాత్రి పూట ఆకలితోనే నిద్రపోవాల్సి వచ్చేదని హసన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. అతని తల్లిదండ్రులు వజ్రాల గనుల్లో కార్మికులుగా పనిచేసేవారు. అతని తల్లి పార్టీలు, పెళ్లిళ్లలో రోటీలను తయారు చేసి డబ్బులు సంపాదించేది. ఆ విధంగా హసన్ కష్టపడి చదివి ఒక్కో మెట్టుకు ఎదుగుతూ నేడు ఈ స్థానానికి చేరుకున్నాడు.