Advertisement
మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలన్న సంగతి తెలిసిందే. పోషకాల్లో అనేక రకాలు ఉంటాయి. మన శరీరానికి కార్బొహైడ్రేట్లు, ఫ్యాట్స్, ప్రోటీన్లు స్థూల పోషకాలుగా ఉన్నాయి. వీటిని నిత్యం మన శరీరానికి అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్లు ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల శరీర నిర్మాణం జరుగుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. ఇతర లాభాలు కూడా ఉంటాయి. అయితే ప్రోటీన్లు అందాలంటే నిత్యం మాంసమే తినాల్సిన పనిలేదు. వీటిని తిన్నా మనకు నిత్యం ప్రోటీన్లు అందుతాయి. అవేమిటంటే…
1. కోడిగుడ్లు:
మార్కెట్‌లో ప్రస్తుతం ఒక్కో కోడిగుడ్డ ధర రూ.5 నుంచి రూ.7 మధ్య ఉంది. ఒక్క గుడ్డును నిత్యం తినడం ద్వారా మన శరీరానికి 6 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.
2. సోయాబీన్:
Advertisements
రూ.10 పెడితే సోయాబీన్ చంక్స్ 50 గ్రాములు వస్తాయి. వాటిల్లో 26 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది.
Advertisement
3. పనీర్:
మార్కెట్‌లో 100 గ్రాముల పనీర్ ధర రూ.24గా ఉంది. దాంట్లో మనకు 16 గ్రాముల వరకు ప్రోటీన్లు, కొవ్వులు లభిస్తాయి.
4. శనగలు:
శనగల్లోనూ ప్రోటీన్లు ఎక్కువగానే ఉంటాయి. రూ.10కి 100 గ్రాముల శనగలు వస్తాయి. వాటిని తింటే 19 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.
5. పెసలు:
పెసలను మొలకెత్తిన గింజల రూపంలో తింటే మంచిది. రూ.12 పెడితే 100 గ్రామలు పెసలు వస్తాయి. వాటిల్లో 24 గ్రాముల వరకు ప్రోటీన్లు ఉంటాయి.
Advertisements