Advertisement
సాధారణంగా మనం కరెంట్ ను వాడుకుంటాం… ప్రభుత్వానికి నెలనెలా బిల్ కడతాం కదా.! కానీ ఈ గ్రామం లెక్క వేరు. వారే కరెంట్ ను గవర్నమెంట్ కు అమ్ముతారు. విచిత్రంగా ఉన్నా ఇది నిజం… ఆ గ్రామమే తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఉన్న ఒడన్‌తురై. ఆసియాలో ది బెస్ట్ స్మార్ట్ విలేజ్ .! ఈ గ్రామ అభివృద్దిలో కీలక పాత్ర ఆ గ్రామ సర్పంచ్ షణ్ముగన్ ది. 1996 లో సర్పంచ్ అయిన ఆయన ఆ గ్రామ స్వరూపాన్నే మార్చేశాడు.
కరెంట్ ఉత్పత్తి ఎలా చేశారు?:
షణ్ముగన్ గ్రామ పంచాయతీ వద్ద ఉన్న రూ.40 లక్షలకు మరో రూ.1.10 కోట్లను అప్పుగా తెచ్చి…. గ్రామంలో విండ్‌మిల్ ను ఏర్పాటు చేశారు. దీంతో పవన విద్యుత్ ఉత్పత్తి అయ్యేది.ఆ విండ్‌మిల్ ద్వారా గ్రామానికి సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేశాక.. మిగులు విద్యుత్‌ను వారే రాష్ట్రానికి అమ్మడం మొదలు పెట్టారు. అలా వచ్చిన ఆదాయంతో విండ్ మిల్ ఏర్పాటుకు తీసుకున్న రుణాన్ని 2017లోనే తీర్చేశారు.
- సర్పంచ్ కాగానే…షణ్ముగన్ పేదలకు 877 పక్కా ఇండ్లు కట్టించాడు.
Advertisement
- ఒడన్‌తురై గ్రామంలో 100 శాతం మరుగుదొడ్లు ఉన్నాయి. దేశంలో ఆ ఘనత సాధించిన తొలి గ్రామం ఇదే.!
Advertisements
- ఇక్కడి గ్రామస్థులందరూ 100 శాతం పన్నులు చెల్లిస్తారు. ప్రతి పైసా ఫర్పెక్ట్ లెక్క ఉంటుంది. ఆ డబ్బునే అభివృద్దికి వాడారు.
ట్విస్ట్ ఏంటంటే…. ఇంత అభివృద్ధి చేసిన షణ్ముగన్ 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన కెనడాలోని టొరంటో యూనివర్సిటీలో విద్యార్థులకు స్మార్ట్ విలేజ్‌లపై పాఠాలు చెబుతున్నారు.
Also Read : సీతక్క సరే ! .., మరి పక్కనున్న ఈ అక్క గురించి మీకు తెలుసా?
Also Read : నా స్టోరి …. నేనో సెక్స్ వర్కర్ ను …నా కూతుర్ని అలా పెంచాలనుకోట్లేదు.
Also Read : పురిటి నొప్పుల బాధ ఇలా ఉంటుంది- ఓ తల్లి అనుభవం.
Advertisements
Also Read : భర్త సెల్యూట్ కొట్టడం చూసి ఏకంగా IPS అయ్యింది.!