Advertisement
40 మంది భారత సైనికులను పొట్టను పెట్టుకున్న పుల్వామా దాడిలో అమరుడైన మేజర్ విభూతి శంకర్ భార్య నిఖిత … ఆయన చితి మీద తను సైన్యంలో చేరి దేశ సేవ చేసి భర్తకు అసలైన నివాళి అర్పిస్తానని ప్రమాణం చేసింది. అప్పటింకా శంకర్ నిఖితలకు పెళ్లై 10 నెలలు కూడా కాలేదు.
సరిగ్గా ఏడాది తర్వాత… సైన్యంలో చేరడానికి రాసే Short Service Commission (SSC) పరీక్ష ను ఇంటర్వ్యూ క్లియర్ చేసి… ప్రస్తుతం మెరిట్ లిస్ట్ కోసం ఎదరుచూస్తుంది నిఖిత. రిజల్ట్ రాగానే సైన్యంలో చేరడానికి సిద్దంగా ఉంది.
“శంకర్ నాతో ప్రతి విషయాన్ని పంచుకునే వాడు… సైన్యం గురించి గొప్పగా చేప్పేవాడు. తనకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆయన స్ఫూర్తిని కొనసాగించాలనుకుంటున్నాను. భావి తరాలకు నాభర్త గురించి తెలియాల్సిన అవసరముంది…అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. భర్త మరణం తర్వాత నా ప్రతి అడుగులో నా అత్తింటి వారు అండగా ఉన్నార”ని తెలిపింది నిఖిత.
Advertisement
Advertisements
నిజంగా…ఎంత గుండె ధైర్యం…ప్రమాదమని తెలిసినా, ప్రాణాలు పోతాయని తెలిసినా తన భర్త నడిచిన బాటనే ఎంచుకొని భర్తకు సరైన నివాళర్పించాలని చూసే ఇలాంటి భార్యను పొందడం శంకర్ అదృష్టమే…ఇలాంటి భార్యభర్తలు మనదేశంలో పుట్టడం మన అదృష్టం.
Advertisements
పుల్వామా దాడి వివరాలు:
2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా సమీపంలో కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది CRPF సైనికులు మరణించారు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడి చేసింది. ఆ 40 మంది సైనికులలో శంకర్ ఒకరు.!