Advertisement
మాది బంగ్లాదేశ్…నా పేరు పర్వీన్! 18 ఏళ్ల వయస్సులో నాకు వివాహమైంది! నా భర్త వయస్సు నాకంటే 10 ఏళ్లు ఎక్కువ. అయినా నా భర్త నన్ను చాలా బాగా చూసుకునేవాడు….ఆయనది ఒకటే కోరిక…. వీలైనంత త్వరగా తనకో వారసుడిని కని ఇవ్వాలని! అనుకున్నట్టుగానే పెళ్లైన మూడు నెలలకే నేను నెల తప్పాను! ఆయన సంతోషానికి అవధులు లేవు…నాకు వారసుడు పుట్టబోతున్నాడంటూ ఆపాటికే స్వీట్లు తెచ్చి పంచేశాడు…. ముగ్గురు అన్నాదమ్ముల్లో నా భర్తే చివరి వాడు..వాళ్లందరికీ ఆడపిల్లలే పుట్టారు! అందుకే కొడుకు కోసం ఎదురుచూస్తున్నాడు.
Advertisement
నాకు నెలలు నిండుతున్నాయి.. నా భర్త నాకిష్టమైనవన్నీ తెచ్చి ఇస్తున్నాడు … నన్ను అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు.! కాన్పు టైమ్ వచ్చింది….లేబర్ రూమ్ లో 52 గంటల పాటు నరకయాతన పడిన తర్వాత అమ్మాయి పుట్టింది! అప్పటి నుండి నా భర్త ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు వచ్చింది…అప్పటి వరకు నన్ను ప్రేమతో చూసుకున్న నా భర్త అప్పటి నుండి చీటికిమాటికి కొడుతుంటే వాడు….పాపను
ఆనాథశ్రమంలో చేర్పిద్దామంటాడు…. పాప ఏడిస్తే అసహ్యించుకునేవాడు.! కొడుకే కావాలనుకున్నాడు కాబట్టి…. నా ప్రతి కదలికను ద్వేషించేవాడు.!
Advertisements
ఓపిక నశించింది…అతనికి విడాకులిచ్చి పాపతో పాటు కట్టుబట్టలతో బయటికొచ్చేశాను. చేతనైనా పని చేసుకుంటూ నా చిట్టిదాని పొట్ట నింపుకోగలుగుతున్నాను.! ఇప్పుడు అమ్మాయి స్కూల్ కు వెళుతుంది… నాభర్త రెండో పెళ్లి చేసుకున్నాడట….ఆమెకు కూడా అమ్మాయే పుట్టిందట!
Advertisements