Advertisement
మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది… నాన్న, నేను, చెల్లి….. అతికష్టం మీద నాన్న మా కుటుంబాన్ని నడిపాడు.! వయస్సులో చెల్లికంటే 5 ఏళ్లు పెద్ద కావడంతో చెల్లిని తల్లి లెక్క చూసుకున్న…… నా 20 ఏళ్ల వయస్సుల్లో మా నాన్న ఓ సంబంధాన్ని చూసి నాకు పెళ్లి చేశాడు. పెళ్లైన సంవత్సరం తర్వాత….చెల్లిని కూడా నాతో పాటే తీసుకెళ్లాను.!
నా భర్త చాలా మంచివాడు….ఉదయం డ్యూటీకి వెళితే సాయంత్రం వచ్చేవాడు. ఆయనొచ్చే వరకు నేను చెల్లి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని వంట సిద్దంగా ఉంచేవాళ్లం! అన్యోన్యంగా సాగుతుంది మా బంధం!
Advertisement
నేను గర్భావతిని….నాకు ఎక్కువగా రెస్ట్ ఇచ్చి….ఇంటి పనులన్నీ చెల్లే చూసుకుంటుంది! నెలలు నిండాయి కాన్పు కొరకు హాస్పిటల్ లో చేర్పించారు.! పండంటి బాబుకు జన్మనిచ్చాను. హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్నాను…. ఓ రోజు రాత్రి నేను నిద్రలో ఉన్న సమయంలో….నా భర్త నా చెల్లి బెడ్ రూమ్ లోకి వెళ్లడాన్ని నేను గమనించాను…. తర్వాత తెలిసింది…..నేను డెలివరీకోసం హాస్సిటల్ కు వెళ్లినప్పటి నుండి వీరు శారీరకంగా కలుసుకుంటున్నారని…. చెల్లికి చెప్పి చూశాను…. అయినా తనలో ఎటువంటి మార్పు లేదు… భర్తకు చెప్పి చూశాను…. ఆయనలో కూడా మార్పు లేదు….అందుకే నాలుగు నెలల కొడుకును వెంట బెట్టుకొని నా భర్తను నా చెల్లికి త్యాగం చేసి అక్కడి నుండి వచ్చేశాను.
Advertisements
చెప్పలేనంత బాధను అనుభవిస్తున్నాను…. చెల్లిని తల్లిలాగా చూశాను…తనే నా సవతిగా మారుతుందని ఊహించలేదు…భర్త బంగారం అనుకున్నాను…కొన్ని రోజుల ఎడబాటుకే తట్టుకోలేక ప్రత్యామ్నాయాన్ని వెతుక్కున్నాడు….నేనే నా కొడుకు భవిష్యత్ కోసం కొత్త దారి వెతుక్కున్నాను!
Advertisements