Advertisement
ఈమె నా భార్య., ఇదే మా ఫస్ట్ సెల్ఫీ…పెళ్లికి ముందు వరకు తనెవరో నాకు తెలియదు..నేనెవరో తనకు తెలియదు.! పెళ్లిల్లు రాసి పెట్టుంటాయి అంటారే…అలా జరిగింది మా పెళ్లి.! పెళ్లి గురించి చెప్పాలంటే 4 రాష్ట్రాల కథ గురించి చెప్పాలి.. ఫస్ట్ నా భార్య గురించి చెప్పి…తర్వాత 4 రాష్ట్రాల కథ గురించి చెప్తా.!
2019 పిబ్రవరిలో మా పెళ్లైంది…పెళ్లైన రెండో రోజే నా భార్యను పుట్టింట్లో వదిలేశాను. ఎందుకంటే నేను ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష మరో రెండు నెల్లలో ఉంది. ఇదే విషయం తనకు చెప్పాను…. రెండు రోజుల్లో తను నన్నేం అర్థం చేసుకుందో నాకు తెలియదు కానీ….”మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది” అనింది.
Advertisement
తనను అక్కడ వదిలి ఇంటికొచ్చాక…నేను చేసిన పనికి చాలా మంది తిట్టుకున్నారు. ‘ఇంత దానికి పెళ్లెందుకు, పరీక్ష రాసి ఏం పొడుస్తావ్…నీ భార్య నీకు కాకుండా పోతుంది. సంసారానికి పనికిరాని వాడు’ అంటూ ఇలా అనేక మాటలు పడ్డాను …అయినా నా దృష్టిని మరల్చలేదు.. నా లక్ష్యానికి దూరంగా జరగలేదు.! రెండు నెలలు అహర్నిషలు కష్టపడ్డాను…ఈ రెండు నెలల కాలంలో ఏ రోజూ నా భార్యకు ఫోన్ కూడా చేయలేదు.
నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. నేను రైల్వే ఉద్యోగానికి ఎంపికయ్యాను. అపాంయిట్మెంట్ ఆర్డర్ తీసుకొని నా భార్య దగ్గరికి వెళ్లాను. అదిగో అప్పుడు తీసుకున్నదే ఈ సెల్ఫీ.. నిజంగా ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం కదా.!
Advertisements
నాలుగు రాష్ట్రాల స్టోరి.
మా నాన్న చిన్నప్పుడే గుజరాత్ వలస వచ్చారు. నాభార్య వాళ్ల నాన్న చిన్నప్పుడే జార్ఖండ్ కు వలస వెళ్లారు. మా నాన్న, వాళ్ల నాన్న చిన్ననాటి స్నేహితులు వారిది బీహార్…నాకు జాబ్ వచ్చింది మహారాష్ట్రలో.!
Advertisements