Advertisement
2012 సెప్టెంబర్ 9 , ఆదివారం నాడు ఓ తెలుగు దినపత్రికలో వచ్చిన మోనాల్ గజ్జర్ ఇంటర్వ్యూ ఇది., సుడిగాడు సినిమా తర్వాత అప్పట్లోనే వరుస అవకాశాలు చేజిక్కించుకున్న మోనాల్ తర్వాత తెరమరుగైంది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో సందండి చేస్తుంది.
మోనాల్ గజ్జర్….2012లో తెలుగు న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ.!
మీ గురించి చెప్పండి?
మాది అహ్మదాబాద్ , నాన్న చీరల వ్యాపారి, అమ్మ హౌస్ వైఫ్, B.Com తర్వాత ఓ బ్యాంక్ లో పనిచేసే క్రమంలో కొలిగ్స్ మోడలింగ్ చేయమని ప్రోత్సాహించడంతో 2006లో మిస్ గుజరాతీ పోటీల్లో పాల్గొని గుజరాత్ స్మైల్ బిరుదు పొందాను, 2010 లో మిస్ గుజరాత్ గా సెలెక్ట్ అయ్యాను.
తెలుగు సినిమాలో అవకాశమెలా వచ్చింది?
దర్శకుడు పూరీ జగన్నాథ్ నన్ను పిలిచారు. నేను వెళ్లి కలిశాక వారు అనుకున్న కథకు నేను సరిపోతానని భావించి నన్ను ఎంచుకున్నారు. అయితే ఆ కథ తెర మీదకు రావడానికి ఇంకాస్త సమయం పడుతుండడంతో పూరీ నా గురించి దర్శకుడు ప్రభాకర్ కు తెలిపారు. ఆవిధంగా ప్రభాకర్ గారిని కలిశాక ‘ఒక కాలేజీ స్టోరి’ లో నటించే అవకాశం లభించింది.
Advertisements
Advertisement
మీకు ఎటువంటి పాత్రలంటే ఇష్టం?
నేను చేసిన ప్రతీ పాత్ర నలుగురికీ గుర్తుండిపోవాలి!
ఎక్స్ పోజింగ్ గురించి మీరేమంటారు?
ప్రేక్షకులు కోరుకున్నట్టు నటించడంలో తప్పులేదు అయితే ఎవరూ కూడా కేవలం హీరోయిన్ అందం చూడడానికి సినిమాకు రారు కదా! ప్రేక్షకులను ఆకర్షించాలంటే కథ, కథనం బాగుండాలి. కాబట్టి ఎప్పుడైనా మంచి కథలకే నా ప్రాధాన్యం. అలాగే తెరపై అందంగానూ కన్పించాలి. ఇందుకు నాకు అభ్యంతరాల్లేవు. కథ, పాత్ర డిమాండ్ చేస్తే గ్లామర్ గా నటిస్తాను. కానీ ఎప్పుడూ టూ పీస్ లేక బికినీ వేసుకొని నటించను, ముద్దు సీన్లో కూడా నటించను.
మోనాల్ తెలుగు లో చేసిన సినిమాలు:
- సుడిగాడు
- వెన్నెల 1 1/2
- ఒక కాలేజ్ స్టోరి
- బ్రదర్ ఆఫ్ బొమ్మాలి
- దేవదాసి
పూర్తి ఇంటర్వ్యూ:
Advertisements