Advertisement
శశి అనే తమిళ డైరెక్టర్ తన బుక్స్ సర్దుతుంటుంటే ఓ న్యూస్ పేపర్ బిచ్చగాడిగా మారిన బిజినెస్ మ్యాన్ అనే ఓ స్టోరీ చదివాడు. ఆ రోజు రాత్రి నిద్రలో కూడా అదే న్యూస్ అతడికి కలరూపంలో వచ్చింది. మరునాటి నుండి అదే స్టోరికి ఇంకాస్త డ్రామాను యాడ్ చేస్తూ స్టోరీగా రాయడం మొదలుపెట్టాడు. ఫైనల్ గా అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. ఇదే కథను సినిమాగా తీద్దామని తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు…. తనకు తెల్సిన కొంతమందికి వివరించగా….బిచ్చగాడి పేరుతో సినిమా ఏంటని నిరుత్సాపరిచాయి. అయినా కథమీద నమ్మకంతో ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
అప్పుడే విజయ్ ఆంటోనిని సంప్రదించాలనుకున్నాడు…దీనికి కారణం విజయ్ కు కథ నచ్చితే అతడే ప్రొడ్యూజర్ గా హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తాడు. అలా అప్పటికే కొన్ని సినిమాలు కూడా చేశాడు…..దీంతో కథ అతనికి నచ్చితే ప్రాబ్లమ్ సాల్వ్ అనుకున్నాడు శశి…అనుకున్నట్టుగానే స్క్రిప్ట్ ను విజయ్ కు వినిపించాడు…ఇంప్రెస్ అయిన విజయ్ కథకు ప్రొడ్యూజర్ గా, హీరోగా ఒప్పుకున్నాడు…మ్యూజిక్ డైరెక్టర్ గా వేరే వాళ్లను పెట్టుకుందామన్నాడు…. సరే అని చెప్పిన శశి షూటింగ్ స్టార్ట్ చేశాడు.
Advertisement
2 కోట్ల బడ్జెట్ తో సినిమాను తీశారు. విజయ్ ఆంటోనియే మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. సినిమా రిలీజ్ అయినప్పటి నుండి హిట్ టాక్ తో దూసుకెళ్ళిన బిచ్చగాడు దాదాపు 40 కోట్లను కలెక్ట్ చేసింది.
Advertisements
Advertisements
తెలుగులోకి బిచ్చగాడు :
ఇదే సినిమాను తెలుగులో రిమేక్ చేయాలనుకొని రానా, సునిల్ ను సంప్రదిస్తే ఆ కథను ఇక్కడ యాక్సెప్ట్ చేయరని రిజెక్ట్ చేశారు. అదే సమయంలో చదలవాడ లక్ష్మణ్ ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ను 45 లక్షలు పెట్టి కొని ఆ సినిమాను తెలుగులోకి డబ్ చేశారు. అదే సమయంలో సరైనోడు, బ్రహ్మోత్సవం, నాని జెంటిల్మెన్, నితిన్ అఆ లు రిలీజ్ అయ్యాయి.
బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వడం ఈసినిమాకు ప్లస్ అయ్యింది. దానికి తోడు కంటెంట్ లో దమ్ము ఉండడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక్కడ కూడా దాదాపు 20 కోట్లు వసూల్ చేసింది ఈ సినిమా! అలా పేరులోనే బిచ్చగాడు ఉన్న ఈ సినిమా దాదాపు 100 మందిని లక్షాధికారులను చేసింది.