Advertisement
అసలు అన్నీ బాగుంటే ఈ పాటికి ఐపిఎల్,బిగ్ బాస్ అన్ని అయిపోయి ఉండేవి..ఏదైతేనేం కరోనా ఎలాగు తగ్గుముఖం పట్టేట్టు లేదు, జాగ్రత్తలతో ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నారు..లాక్ డౌన్ సడలింపులతో సీరియల్ షూటింగ్స్ ప్రారంభం కావడం నటులు కరోనా బారిన పడడంతో బిగ్ బాస్ ఉంటుందా లేదా అనే సందిగ్దత.. మొత్తానికి ఉంటుందని ప్రోమో రిలీజ్ చేసింది మా టివి.. యాంకర్ గురించి,కంటెస్టంట్స్ గురించి ఎన్నో తర్జన భర్జనలు..హోస్ట్ గా నాగార్జున ఫైనల్ అయ్యాడు..
మరి కంటెస్టెంట్స్??? మొదట ఎవరెవరి పేర్లో వినిపించాయి..కానీ ఇప్పుడు కొత్తలిస్ట్ వచ్చేసింది..వీళ్లే ఫైనల్ అని తెలుస్తోంది.. చాలా పకడ్బందిగా అన్ని జాగ్రత్తలతో ఈ నెలాఖారు,లేదా వచ్చె నెల ఫస్ట్ వీక్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 4 మొత్తం 16-17 కంటెస్టంట్స్ ఉండబోతున్నట్టు సమాచారం.. ముందు సీజన్ల మాదిరిగానే ఈ సారి 100 రోజులు షో ఉండబోతుంది..మరి 100రోజుల పాటు హౌజ్లో సందడిచేయబోయే కంటెస్టెంట్స్ ఎవరోతెలుసుకోండి…
రఘు మాస్టర్, ప్రణవి:
సీజన్ 3లో వరుణ్,వితిక జంటని ప్రవేశ పెట్టిన బిగ్ బాస్ టీం..ఈ సారి రెండు జంటల్ని ప్రవేశపెడుతుంది..మొదటి జంట డ్యాన్స్ మాస్టర్ రఘు, సింగర్ ప్రణవి..ప్రస్తుతానికి తెలిసిన కంటెస్టంట్స్ లిస్ట్ లో వీళ్లిద్దరే బిగ్ బాస్ 4లో స్పెషల్ అట్రాక్షన్..
Advertisements
జాహ్నవి ,సుశాంత్:
రెండో జంట జాహ్నవి తన భర్త సుశాంత్.. మహాతల్లిగా జాహ్నవి అందరికి సుపరిచితురాలే.
జోర్దార్ సుజాత:
హెచ్ఎమ్టివిలో వచ్చే జోర్డార్ ప్రోగ్రామ్ యాంకర్ సుజాత..అసలు పేరు శృతి..గత సీజన్లోని శివజ్యోతి ప్లేస్ ని రీప్లేస్ చేసే క్యాండేట్ సుజాత.. శివజ్యోతిలా ఏడవకుండా తెలంగాణా పోరిలా హౌజ్లో కూడా రచ్చరచ్చ చేస్తుందేమో చూడాలి..అసలే ఈ పిల్లది ఓరుగల్లు జిల్లా..
అరియానా గ్లోరి:
టిక్ టాక్ స్టార్, సెలబ్రిటిలను ఇంటర్వ్యూ చేసే అరియానా గ్లోరి మరో కంటెస్టంట్ గా రాబోతుంది..ఎవరీ అమ్మాయి ఎప్పుడూ విన్నట్టుగా,చూసినట్టుగా లేదే అనుకుంటున్నారా? ఈ అమ్మాయి తొడల గురించే వర్మ కామెంట్ చేసింది.. ఆ కామెంట్ తో సోషల్ మీడియాలో వైరలయింది.
మెహబూబ్:
దిల్ సే మెహబూబ్ టిక్ టాక్ స్టార్, షార్ట్ ఫిలింస్ చేస్తుంటాడు..తన వాల్ నుండి సినిమాలను ప్రమోట్ చేస్తుంటాడు..
సోహైల్ రియాన్:
సోహైల్ రియాన్ మరో వెబ్ క్యాండిడేట్..బిగ్ బాస్ హౌజ్ కే కాదు, ప్రేక్షకులకు కొత్త ముఖమే.. హౌజ్లో ఏ విధంగా అలరిస్తాడో చూడాలి..
Advertisement
కరాటే కళ్యాణి:
అబ్బా.. అబ్బా..డైలాగ్ తో అందరకి పరిచయమే..రవితేజ మూవిస్ మిరపకాయ్,రాజా ది గ్రేట్, కృష్ణ తదితర సినిమాల్లో నటించిన కరాటే కళ్యాణి..ఈమె రాకతో హౌజ్ కొంచెం హడావిడిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
లాస్య:
ఒకప్పటి స్టార్ యాంకర్.. పెళ్లి,బాబు పుట్టడంతో కొంచెం బ్రేక్ తీసుకున్న లాస్య..ఈ మధ్య టిక్ టాక్స్ కొన్ని టివి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది..బిగ్ బాస్ తో మళ్లీ పూర్తి ఫామ్లోకి రాబోతుంది.
నోయల్:
సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ జిగ్రి దోస్త్.. ర్యాపర్,సింగర్, యాక్టర్ నోయల్ కూడా హౌజ్లో ఉంటే సందడిగా ఉంటుందని ప్రేక్షకుల అభిప్రాయం.
నందు:
యాక్టర్ ,సింగర్ గీతామాధురి భర్త నందు .. నందు కూడా అందరికి తెలిసిన ముఖమే..
ప్రశాంతి:
జెమిని టివి యాంకర్..ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తూంది..ప్రశాంతి ముఖం బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే.
ఆటో రాంప్రసాద్:
జబర్దస్త్ నుండి ఆటో రాంప్రసాద్, లేదంటే ముక్కు అవినాష్ వీరిద్దరిలో ఒకరు రాబోతున్నట్టు సమాచారం..రాంప్రసాద్ వస్తే ఆటో పంచ్లు ఉంటాయా చూడాలి..
దేవి నాగవల్లి:
టివి9 దేవి నాగవల్లి కూడా రాబోతున్నట్టు సమాచారం..బిగ్ బాస్లో తొలి నుండి టివి9 క్యాండేట్స్ ఉంటున్న సంగతి తెలిసిందే దీప్తి నల్లమోతు, జాఫర్,ఇప్పుడు దేవి నాగవల్లి..
హారిక:
హారిక అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కాని దేత్తడి హారిక అంటే ఇట్టే గుర్తు పడతారు.. ఈమె కూడా బిగ్ బాస్ హౌజ్లో అడుగుపెట్టబోతుందని సమాచారం.
Advertisements
ఇది బిగ్ బాస్ లిస్ట్..వీళ్లల్లో ప్రణవి,రఘు,కరాటే కళ్యాణి,హారిక,నందు మరియు రాంప్రసాద్ మినహా మిగతా కంటెస్టెంట్స్ విషయంలో అంతగా ఆసక్తి చూపట్లేదనేది..సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్స్ ని బట్టి అర్దం అవుతోంది..మరి మిగతావాళ్లు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారో..??