Advertisement
కరోనా కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడిన బిగ్ బాస్ సీజన్ 4 సెప్టెంబర్ 6న ఘనంగా ప్రారంభమైంది.ప్రారంభమైన మొదటి రోజే బిగ్ బాస్ లో నవరసాలు పండాయి.మొదటిరోజు అసలు బిగ్ బాస్ హౌస్ లో జరిగిన సంగతులేంటో వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లను నిద్రలేపడానికి సయ్యా.. సయ్యోరే పాటను ప్లే చేశారు.ఈ పాటకు కంటెస్టెంట్ లు తమదైన శైలిలో డ్యాన్స్ లు వేసి బిగ్ బాస్ హౌస్ లో మొదటిరోజును ప్రారంభించారు.ఇక ఫిట్ గా ఉండడం కోసం తాను చెమటలు పట్టని ఎక్ససైజ్ గురించి చేస్తున్నట్లు దర్శకుడు సూర్య కిరణ్ మిగతా కంటెస్టెంట్ లకి వివరించారు.
ఆ తరువాత కిచెన్‌లో దర్శకుడు అమ్మ రాజశేఖర్, సూర్య కిరణ్ తదితరులు హౌస్‌లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి కాని..అవి కళ్యాణి అరుపులు వింటే పారిపోతాయని జోక్‌లు వేసి నవ్వులు పూయించారు.ఇక మొదటిరోజు సీక్రెట్ రూంలో కాలం వెళ్లదీస్తున్న అరియానా, సోహైల్ వీపు మీద ఎక్కి కూర్చుని తన అల్లరిని ప్రారంభించింది.
ఇక తొలి టాస్క్ కోసం బిగ్ బాస్ ఒక లేఖను పంపారు.అందులో భాగంగా స్లిప్‌లో రాసి ఇచ్చిన వాటిని వివరించాలని కోరారు.ఈ టాస్క్ లో మోనాల్ కు తన ఊరి గురించి చెప్పమని ఓ స్లిప్ వచ్చింది.ఊరి గురించి మొదలుపెట్టిన మోనాల్ డైవర్ట్ అయ్యి తన తండ్రి చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకొని ఏడ్వడం మొదలుపెట్టింది.పాపం మోనాల్ కష్టాన్ని విన్న గంగవ్వ కంటిలో కూడా నీళ్ళు తిరిగాయి .పాపం మెహబూబ్ దిల్‌సే సైతం తన పేరెంట్స్‌ని గుర్తు చేసుకుని కన్నీరు కార్చాడు.అనంతరం గంగవ్వకు తల పట్టిన అఖిల్ సార్థక్ నాకు అమ్మమ్మ ఉంటే ఇలాగే చేసేవాడిని అని అన్నాడు.
Advertisements
Advertisement
ఇక సీక్రెట్ రూమ్ లో ఉన్న సొహైల్, అరియానా కాల్ చేశారు.ఆ కాల్ ను జోర్దార్ సుజాత లిఫ్ట్ చేసి వారు చెప్పిన ఫుడ్ ఆర్డర్ అంతా విన్నది.కాల్ రాగానే అందరికంటే వేగంగా స్పందించి ఫోన్ లిఫ్ట్ చేసిన జోర్దార్ సుజాతపై ఫోన్ చేసింది ఎవరో? ఏంటో తెలుసుకోవాలి కదా అని కరాటే కళ్యాణి తీవ్రంగా మండిపడింది.ఆ తరువాత ఫోన్ మోగగనే కాల్ ను లిఫ్ట్ చేసిన కరాటే కళ్యాణి బిగ్ బాస్ అని సంబోధిస్తూ స్టోర్ రూమ్ లో ఫుడ్ ఆర్డర్ అంతా పెట్టారు.
మొదటరోజు పూర్తి కాకముందే ఈవారం నామినేషన్స్ ను బిగ్ బాస్ మొదలు పెట్టారు.మొత్తం 16 మంది కంటెస్టెంట్ లను ఎనిమిది జంటలుగా చేసిన బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో ఉన్న జంటకు నామినేషన్స్ ప్రక్రియ నుండి బ్రేక్ ఇచ్చి. మిగతావాళ్ళను జంటలుగా నిలబెట్టి వారిలో ఒకరిని ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ చేయవలసిందిగా హౌస్ సభ్యులను ఆదేశించారు.దీనితో అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాత, గంగవ్వలు ఈవారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.
Advertisements
ఇక ఈ ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో కరాటే కళ్యాణి సుజాత మధ్య మళ్లీ వాగ్వాదం భగ్గుమంది. దీన్ని పాపం నానా కష్టలుపడి దర్శకుడు సూర్య కిరణ్ ఆపారు.అప్పటికి ఈ అంశం సద్దుమణిగిన ఆతరువాత లోపలికి వెళ్ళాక మళ్లీ రాజుకుంది.దీనితో సుజాతకు వంట బాధ్యతలను అప్పజెప్పిన కరాటే కళ్యాణి తన రూంలోకి వెళ్లి ఏడవడం మొదలుపెట్టింది.పాపం దీన్ని కంట్రోల్ చేయడానికి లాస్య నానా కష్టాలు పడింది.ఇవండీ బాబు బిగ్ బాస్ హౌస్ లో మొదటిరోజు విశేషాలు ఇక రేపు ఇచ్చిన ఫన్నీ టాస్క్ గురించి రేపు జరగబోయే ఆసక్తికర విషయాలు గురించి రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.