Advertisement
నిన్నటి ప్రోమో చూసి అందరూ గెస్ చేసినట్టే ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో మినీ యుద్ధమే జరిగింది.ఇక తమకు టిఫిన్, లంచ్ ఇవ్వకపోవడంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సొహైల్, అరియానా గ్లోరీలను చూసి ఇంటి సభ్యులు షాక్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే సొహైల్ ఇంటిసభ్యులను పరిచయం చేసుకునే పనిలో బిజీ అయ్యాడు.ఈ టైంలో అందరూ గేదర్ అవ్వండి అని సొహైల్ ను పక్కకు తీసుకెళ్లిన అరియానా మనం ముందు వచ్చిన పని చూద్దాం అని అతన్ని వారించి మార్నింగ్ నుండి మేం ఏం తినలేదని బాధపడింది.అంతేకాకుండా అసలు ఫోన్ ఎందుకు కట్ చేశారు అని నోయల్ ను అడిగింది.
దీనిపై స్పందిచిన నోయల్ తనదైన శైలిలో మీరు రెండు పూటలు తిండిలేకపోతే ఇంత బాధ పడుతున్నారు.. మూడు రోజులుగా గంగవ్వ టీ లేకుండా ఇబ్బంది పడుతుందని.. మీరు అసలు షుగర్ అంతా ఎలా అడుగుతారు అసలు బిగ్ బాస్ పేరు చెప్పి పనులు చేయించుకోవడం తప్పు.. మీకు మాట్లాడటం చేతకాలేదు.. నిన్న ఫుడ్ వచ్చింది కాబట్టి బయటకు రాలేదు.. ఈరోజు ఫుడ్ రాలేదు కాబట్టి బయటకు వచ్చారు అంటూ ఆ డిస్కషన్ ను ఎండ్ చేయడానికి ప్రయత్నించాడు.
కానీ ఈ విషయాన్ని వదలని అరియానా చెప్పండి నోయల్ గారు అంటూ నోయల్ ను తెగ విసిగించింది కాని నోయల్ పోయి ఫుడ్ తిను అంటూ ఆ టాపిక్ ను అక్కడితో ఎండ్ చేశాడు.ఇక లాస్య మీకు కావాల్సిన షుగర్ వాడుకున్నాక రిమేయినింగ్ షుగర్ ఎందుకు పంపలేదని వాళ్ళని నిలదీసింది.ఈలోపు అభిజిత్,సొహైల్ మధ్య గొడవ రాజేసుకుంది.అసలు వారిద్దరూ ఎందుకు గొడవపడ్డారో ఎవరికీ అర్థం కాలేదు.
Advertisement
ఇక తనకి తినిపిస్తేనే తింటానని అరియానా చేసిన పర్ఫార్మెన్స్ తట్టుకోలేకపోయాం.ఇక ఆమె పదే పదే తినిపించాలని అడుగుతుండడంతో అఖిల్ తనకి భోజనం పెట్టడం స్టార్ట్ చేశాడు.ఇది చూసిన నోయల్ డైనింగ్ టేబుల్ పై ప్లేట్ పెట్టి అక్కడ కూర్చుని తిను అని అన్నాడు.ఆయన అరియానా నాకు ఎవరైనా తినిపించాలిసిందే అని అడుగుతుండడంతో ఇక మళ్లీ అఖిల్ ప్లేట్ పట్టుకున్నాడు.దీన్ని చూసి బ్రో ఇది నీ ఇండివిడ్యువల్ డెసిషన్ అనడంతో ప్లేట్ అఖిల్ చేతి నుండి కళ్యాణి చేతికి చేరింది.ఆమె ముద్దలు కలిపి అరియానాకు తినిపించింది.ఆతరువాత ఆకలి బాధ నాకు తెలుసు అని కళ్యాణి డిస్కషన్ పట్టడంతో అక్కడినుండి ముందుగా దేవి ఆ తర్వాత అభిజిత్ లేచి వెళ్ళిపోయారు.ఈ టైంలో ఫాలో… ఫాలో..’ అంటూ కళ్యాణి హేళన చేసింది.
Advertisements
కొద్దిసేపటికే మీరు చేసింది నాకు నచ్చలేదు.. ముఖంపై తలుపు వేసినట్టు అలా లేచి వెళ్లిపోతావా?? అంటూ ఏడుస్తూ దేవిని
అడిగింది . దానికి దేవి నాకు నచ్చలేదు అందుకే లేచి వచ్చేశా అని కుండ బద్దలు కొట్టేసింది.దీనితో నేను వెళ్ళిపోతా అంతా ఏడుస్తూ కూర్చుంది.పాపం ఆమెను కంట్రోల్ చేయడం కోసం సూర్యకిరణ్ బాగా కష్టపడ్డారు.
Advertisements
ఇక ఉదయాన్నే వేకప్ సాంగ్ కు నిద్రలేచి తమదైన స్టైల్ స్టెప్స్ వేసిన ఇంటిసభ్యులు మరో ఫ్రెష్ డేను మొదలుపెట్టారు.ఇక అందరినీ తనదైన శైలిలో గంగవ్వ ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది.ఇక గంగవ్వకు సెంట్ కొడుతానని దగ్గరికి వచ్చిన అరియానాను ఏం వద్దు అంటూ గట్టిగా చెప్పింది.ఇక మొత్తం గొడవలు,ఏడ్పులతో ఫుల్ గా నిండిపోయిన బుధవారం ఎపిసోడ్ జనాలకు కొంచెం బోర్ కొట్టించింది.